Gautam Gambhir : ఆసీస్‌తో సిరీస్‌కు ముందు గంభీర్ కీలక వ్యాఖ్యలు.. రోహిత్ శర్మ ఆడకుంటే.. చాలా మంది ఓపెనర్లు ఉన్నారు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనున్నాయి.

Gautam Gambhir key comments before going to Australia series
Gautam Gambhir comments : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనున్నాయి. ఈ సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. వ్యక్తి గత కారణాలతో మొదటి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విలేకరులతో మాట్లాడాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది ఇంకా తెలియదన్నాడు. నవంబర్ 22 వరకు సమయం ఉందన్నాడు. ఏం జరుగుతుందో చూడాలన్నాడు. పెర్త్ టెస్టుకు అతడు అందుబాటులో లేకుంటే అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్ లేదా మరెవరు అయినా ఓపెనర్‌గా ఆడతారు. మా దగ్గర ఓపెనింగ్ కోసం చాలా ఆప్షన్లు ఉన్నాన్నాడు. ఇక శుభ్‌మన్ గిల్‌ను ఓపెనింగ్ పంపిస్తామా? లేదా అన్నది ఇప్పుడే తాను చెప్పలేనని గంభీర్ పేర్కొన్నాడు.
నిజం చెప్పాలంటే తాము ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) గురించి ఆలోచించడం లేదన్నాడు. ప్రస్తుతం తమ దృష్టి అంతా బోర్డర్ గవాస్కర్ సిరీస్ పై ఉంచామన్నాడు. ప్రతి సిరీస్ కీలకమేనని, నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. సిరీస్ ప్రారంభానికి 10 రోజుల సమయం ఉందన్నాడు. జట్టులో చాలా మంది కుర్రాళ్లు ఉన్నారని, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఆసీస్ పిచ్‌లను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని, అవి పేస్‌కు అనుకూలంగా ఉంటాయన్నాడు. ఇక కివీస్‌తో టెస్టు సిరీస్ ఓటమి నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వచ్చిన విమర్శల పై స్పందించాడు. తాము అలాంటివి పట్టించుకోమన్నాడు. టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారన్నాడు. గెలిచేందుకు తాము ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చాడు.
SA vs IND : మ్యాచ్ ఓడిపోయినా.. అరుదైన ఘనత సాధించిన వరుణ్ చక్రవర్తి.. 33 ఏళ్ల వయసులో..
భారత జట్టు రెండు బ్యాచ్‌లుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. మొదటి బ్యాచ్‌లో శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్‌లతో పాటు పలువురు ఆటగాళ్లు ఆదివారం రాత్రి ఆస్ట్రేలియా విమానం ఎక్కారు. ఇక రెండో బ్యాచ్ సోమవారం మధ్యాహ్నం బయలుదేరనుంది.
Gautam Gambhir said, “KL Rahul and Abhimanyu Easwaran are the opening options for us if Rohit Sharma isn’t available”. pic.twitter.com/0EEy0T0dZS
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 11, 2024