SA vs IND : మ్యాచ్ ఓడిపోయినా.. అరుదైన ఘనత సాధించిన వరుణ్ చక్రవర్తి.. 33 ఏళ్ల వయసులో..
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన ఘనత సాధించాడు.

Varun Chakravarthy First Indian to take five wicket haul in t20 after 33rd birthday
SA vs IND : దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన ఘనత సాధించాడు. 125 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ బ్యాటర్లకు చుక్కలు చూయించాడు. అతడి బంతులను ఆడలేక సపారీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మార్‌క్రమ్, క్లాసెన్, హెండ్రిక్స్, మిల్లర్, జాన్సెన్ లను ఔట్ చేసి భారత్‌కు విజయావకాశాలను సృష్టించాడు.
అతడి దెబ్బకి సౌతాఫ్రికా 16 ఓవర్లకు 88/7తో నిలిచింది. అయితే.. టీమ్ఇండియా పేసర్ల పేలవ బౌలింగ్ పుణ్యమా అని మ్యాచ్ చేజారిపోయింది. దక్షిణాఫ్రికా 19 ఓవర్లలో మరో మూడు వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో వరుణ్ తన నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు.
IND vs SA: డేవిడ్ మిల్లర్ సూపర్ క్యాచ్.. ఆశ్చర్యపోయిన తిలక్ వర్మ.. వీడియో వైరల్
ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన అతి పెద్ద వయుష్కుడిగా వరుణ్ రికార్డులకు ఎక్కాడు. 33 సంవత్సరాల 73 రోజుల వయస్సులో వరుణ్ చక్రవర్తి ఈ ఫీట్ సాధించాడు. అంతకముందు ఈ రికార్డు భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (32 సంవత్సరాల, 215 రోజులు) పేరిట ఉండేది.
ఇక ఓవరాల్‌గా టీ20ల్లో ఐదు వికెట్ల ఘనత ప్రదర్శన చేసిన ఐదో భారత ఆటగాడిగా వరుణ్ ఘనత సాధించాడు. యజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ (రెండుసార్లు), భువనేశ్వర్ కుమార్ (రెండుసార్లు) లు ఈ జాబితాలో ఉన్నారు.
IND vs AUS : ఆస్ట్రేలియా టూర్‌కు బయలుదేరి వెళ్లిన టీమిండియా ప్లేయర్లు.. వీడియో వైరల్