IND vs SA: డేవిడ్ మిల్లర్ సూపర్ క్యాచ్.. ఆశ్చర్యపోయిన తిలక్ వర్మ.. వీడియో వైరల్
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్ సూపర్ క్యాచ్ .. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

david miller catch tilak varma out
IND vs SA 2nd T20 : ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరుగుతుంది. తొలి టీ20 మ్యాచ్ లో భారత్ జట్టు విజయం సాధించగా.. ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియాను దక్షిణాఫ్రికా జట్టు ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు తొలుత వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ.. స్టబ్స్ (47నాటౌట్), కొయెట్టీ (19నాటౌట్) రాణించడంతో దక్షిణాఫ్రికా జట్టు లక్ష్యాన్ని చేదించింది. దీంతో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
Also Read: IND vs AUS : ఆస్ట్రేలియా టూర్‌కు బయలుదేరి వెళ్లిన టీమిండియా ప్లేయర్లు.. వీడియో వైరల్
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్ సూపర్ క్యాచ్ మ్యాచ్ కే హైలెట్ గా చెప్పుకోవచ్చు. భారత ఇన్నింగ్స్ లో తిలక్ వర్మ నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. తద్వారా 20 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, ఒక సిక్స్ ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరపున ఎడిన్ మార్క్‌రామ్ ఎనిమిదో ఓవర్ బౌలింగ్ చేశాడు. తిలక్ వర్మ క్రీజులో ఉండగా.. ఆ ఓవర్లో చివరి బంతిని షాట్ ఆడాడు. బౌండరీవైపు వేగంగా వెళ్తున్న బంతిని డేవిడ్ మిల్లర్ భారీ డైవ్ చేసి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. అద్భుతరీతిలో క్యాచ్ అందుకోవడంతో క్రీజులో ఉన్న తిలక్ వర్మకు కొద్దిసేపు ఏమీ అర్ధంకాలేదు. బాల్ మిల్లర్ చేతిలోకి ఎలా వెళ్లింది అన్నట్లుగా చూస్తు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఆ తరువాత క్యాచ్ ఔట్ అని తెలుసుకొని క్రీజును వదిలి తిలక్ వర్మ పెలివియన్ వైపు అడుగులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Also Read: IND vs SA: సౌతాఫ్రికాపై టీమిండియా ఓటమి.. వారివల్లనే ఓడిపోయామన్న కెప్టెన్ సూర్య
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ లో భారత్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ 18 బంతులు ఎదుర్కొని 33 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.
A STUNNER FROM DAVID MILLER. 🤯 pic.twitter.com/7nwZMQs1WW
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 10, 2024