IND vs AUS : ఆస్ట్రేలియా టూర్‌కు బయలుదేరి వెళ్లిన టీమిండియా ప్లేయర్లు.. వీడియో వైరల్
ఆస్ట్రేలియా వేదికగా జరిగే బోర్డర్ గావస్కర్ ట్రోపీలో తొలి టెస్ట్ నవంబర్ 22న జరగనుంది. అయితే, తొలి టెస్టు మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ

mohammed siraj, Yashasvi Jaiswal
Border Gavaskar Trophy 2024: భారత క్రికెట్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ముంబై విమానాశ్రయం నుంచి ఆస్ట్రేలియాకు విమానం ఎక్కారు. బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ లు జరగనున్నాయి. ఈనెల 22 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది.
ముంబై విమానాశ్రయంకు టీమిండియా ప్లేయర్లు ప్రత్యేక బస్సులో చేరుకున్నారు. మహ్మద్ సిరాజుద్దీన్, యశస్వీ జైస్వాల్, ఆకాశ్ దీప్, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయక్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ షా తదితరులు ముంబై విమానాశ్రయం నుంచి ఆస్ట్రేలియా టూర్ కు బయలుదేరి వెళ్లారు. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ముంబైలో విలేకరుల సమావేశం ముగిసిన తరువాత మిగిలిన ఆటగాళ్లు సోమవారం తమ విమానంలో ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నారు.
ఆస్ట్రేలియా వేదికగా జరిగే బోర్డర్ గావస్కర్ ట్రోపీలో తొలి టెస్ట్ నవంబర్ 22న జరగనుంది. అయితే, తొలి టెస్టు మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరవుతున్నట్లు తెలిసింది. అయితే, బీసీసీఐ సమాచారం ప్రకారం.. నవంబర్ 22న తొలి టెస్టు ప్రారంభం కావడానికి ముందు రోహిత్ శర్మ భారత జట్టు శిబిరంలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ శర్మ మొదటి టెస్టుకోసం అందుబాటులో లేకుంటే.. కెప్టెన్ గా జస్ర్పీత్ బుమ్రా వ్యవహరించే అవకాశం ఉంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (సి), జస్ప్రీత్ బుమ్రా (విసి), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (డబ్ల్యుకె), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, మొహమ్మద్. సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్
మ్యాచ్ ల షెడ్యూల్ ఇలా..
మొదటి టెస్ట్ : నవంబర్ 22 -26
రెండో టెస్ట్ : డిసెంబర్ 6 – 10
మూడో టెస్ట్ : డిసెంబర్ 14 – 18
నాల్గో టెస్ట్ : 26 – 30
ఐదో టెస్ట్ – జనవరి 3 – 7
#WATCH | Indian Cricket Team leaves for Australia from Mumbai Airport.
The Indian team will face Australia for the Border-Gavaskar Trophy later this month, from November 22 onwards. pic.twitter.com/CwjZVrdl4U
— ANI (@ANI) November 10, 2024