IND vs AUS: బోర్డర్ గావస్కర్ ట్రోఫీ.. తొలి టెస్ట్ కోసం జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. రెండు మార్పులు

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. ఈనెల 22వ తేదీన తొలి టెస్టు పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది.

IND vs AUS: బోర్డర్ గావస్కర్ ట్రోఫీ.. తొలి టెస్ట్ కోసం జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. రెండు మార్పులు

Pat cummins

Updated On : November 10, 2024 / 10:37 AM IST

Border-Gavaskar Trophy 2024 : బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. ఈనెల 22వ తేదీన తొలి టెస్టు పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగే టెస్ట్ సిరీస్ కోసం భారత్ నుంచి తొలి బృందం ఇవాళ ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. అయితే, తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుకోసం 13 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కెప్టెన్ పాట్ కమిన్స్ సారథ్యంలో బరిలోకిదిగే జట్టులో గాయం కారణంగా కెమెరూన్ గ్రీన్ కు చోటు దక్కలేదు. అతని స్థానంలో ఆస్ట్రేలియా -ఏ జట్టుకు నాయకత్వం వహించిన నాథన్ మెక్ స్వీనే జట్టులో చోటు దక్కించుకున్నాడు.

Also Read: AUS vs IND : కేఎల్ రాహుల్‌ వ‌ద్దు.. ధ్రువ్ జురెల్ ను ఆడించండి..

ఆస్ట్రేలియా జట్టు ఇదే..
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, జోష్ హేజిల్ వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖావాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్ స్వీనే, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.


Also Read: Gautam Gambhir : గంభీర్‌కు లాస్ట్ ఛాన్స్‌! బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ గెల‌వ‌కుంటే.. టెస్టుల‌కు కొత్త కోచ్‌..?

ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఇదిలాఉంటే. కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టు మ్యాచ్ ఆడే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పెర్త్ టెస్టుకు తుది జట్టులో కేఎల్ రాహుల్ కాకుండా ధ్రువ్ జురెల్ ను తీసుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. మరోవైపు.. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌తోనే భార‌త ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ అవ‌కాశాలు ఆధార‌ప‌డి ఉన్నాయి. 4-0 తేడాతో గెలిస్తేనే టీమ్ఇండియా ఆశ‌లు స‌జీవంగా ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.