AUS vs IND : కేఎల్ రాహుల్ వద్దు.. ధ్రువ్ జురెల్ ను ఆడించండి..
టీమ్ఇండియ సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ పై ప్రస్తుతం నెట్టింట విమర్శల జడివాన కొనసాగుతోంది

Dhruv Jurel show breaks internet trumps KL Rahul
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ పై ప్రస్తుతం నెట్టింట విమర్శల జడివాన కొనసాగుతోంది. అదే సమయంలో యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. వీరిద్దరు ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక అయిన సంగతి తెలిసిందే. టెస్టు స్క్వాడ్‌లో ఉన్న వీరిద్దరిని ముందుగానే ఆసీస్ పంపించింది బీసీసీఐ. ఆసీస్-ఏ జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆడించింది. ఇందులో రాణిస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఆసీస్-ఏతో జరిగిన రెండో అనధికార టెస్టు మ్యాచులో కేఎల్ రాహుల్ దారుణంగా విపలం అయ్యాడు. ఓపెనర్‌గా వచ్చి 4, 10 పరుగులు మాత్రమే చేశాడు. అదే సమయంలో ధ్రువ్ జురెల్ అద్భుతంగా రాణించాడు. రెండు హాఫ్ సెంచరీలతో రాణించాడు. ఈ క్రమంలో పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టులో సీనియర్ అయిన కేఎల్‌కు చోటు ఇవ్వొద్దు అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్‌ను ఆడించాలని కోరుతున్నారు.
కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో బాగా ఇబ్బంది పడ్డాడు. పేస్, స్పిన్ అనే తేడా లేకుండా తడబాటుకు గురి అయ్యాడు. ఒక వైపు టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్‌లో తీవ్ర పోటీ ఉన్న సమయంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. ఆఖరికి ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్ సైతం 14, 29 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌తోనే భారత ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. 4-0 తేడాతో గెలిస్తేనే టీమ్ఇండియా ఆశలు సజీవంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 161 పరుగులకే ఆలౌటైంది. ధ్రువ్ జురెల్ (80) ఒంటరి పోరాటం చేశాడు. ఆ తరువాత ఆసీస్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 229 పరుగులకు ఆలౌటైంది. 169 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.