SA vs IND : డర్బన్‌లో చరిత్ర సృష్టించిన సంజు శాంసన్.. దక్షిణాఫ్రికా పై ఫాస్టెస్ట్ శతకం.. ఇంకా పలు రికార్డులు..
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ అరుదైన ఘనత సాధించాడు.

Samson creates history becomes first Indian with centuries in back to back T20I innings
SA vs IND : టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు బాదిన మొదటి భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో శాంసన్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ 50 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 10 సిక్సర్లు బాది 107 పరుగులు సాధించాడు. అంతకముందు.. గత నెలలో హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచులోనూ శాంసన్ శతక్కొట్టాడు.
ఇక ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన నాలుగో ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కాడు. శాంసన్ కంటే ముందుగా ఫిల్‌సాల్ట్ (ఇంగ్లాండ్), రిలీ రొసో (దక్షిణాఫ్రికా), మెకియాన్ లు వరుసగా రెండు మ్యాచుల్లో శతకాలు బాదారు.
KL Rahul : అలా ఎలా ఔట్ అయ్యానబ్బా.. బిత్తరపోయిన కేఎల్ రాహుల్.. వీడియో
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. సంజు శాంసన్ విధ్వంసకర శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శాంసన్‌తో పాటు తిలక్ వర్మ (33; 18 బంతుల్లో 3 ఫోర్లు) రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కొయెట్జీ మూడు వికెట్లు తీశాడు. యాన్సెన్, కేశవ్ మహరాజ్, పీటర్, కుగ్రర్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
భారత బౌలర్ల ధాటికి లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 17.5 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. 25 పరుగులతో క్లాసెన్ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అవేశ్ ఖాన్ రెండు వికెట్లు తీయగా అర్ష్‌దీప్ సింగ్ ఓ వికెట్ పడగొట్టాడు.
శాంసన్ రికార్డులు ఇవే..
ఈ మ్యాచ్‌లో శతకం చేయడం ద్వారా సంజు శాంసన్ పలు రికార్డులను సాధించాడు.
* అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా రెండు మ్యాచుల్లోనూ సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్‌గా శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ కంటే ముందు హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో శాంసన్ శతకం బాదాడు.
* టీ20ల్లో దక్షిణాఫ్రికా పై అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత ఆటగాడిగా శాంసన్ రికార్డులకు ఎక్కాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ 47 బంతుల్లోనే శతకాన్ని బాదాడు. అంతక ముందు ఈ రికార్డు సూర్యకుమార్ యాదవ్ (55) పేరిట ఉండేది.
* అంతర్జాతీయ టీ20ల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన టీమ్ఇండియా ఆటగాళ్లలో రోహిత్ శర్మ రికార్డును శాంసన్ సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ 10 సిక్స్‌లు బాదాడు. శ్రీలంకతో జరిగిన ఓ టీ20లో రోహిత్ కూడా 10 సిక్స్‌లు కొట్టాడు.