AUS vs PAK : పాక్ కెప్టెన్ అతి తెలివితేట‌లు.. ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్‌ను అడిగి రివ్య్వూ తీసుకుంటే ఏం జ‌రిగిందో చూడండి..

సాధార‌ణంగా క్రికెట్ మ్యాచ్‌లో బౌలింగ్ టీమ్ కెప్టెన్లు రివ్య్వూలు తీసుకోవ‌డాన్ని చూస్తూనే ఉంటాం.

AUS vs PAK : పాక్ కెప్టెన్ అతి తెలివితేట‌లు.. ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్‌ను అడిగి రివ్య్వూ తీసుకుంటే ఏం జ‌రిగిందో చూడండి..

Rizwan fooled into taking DRS by Adam Zampa take it trap

Updated On : November 8, 2024 / 3:44 PM IST

AUS vs PAK : సాధార‌ణంగా క్రికెట్ మ్యాచ్‌లో బౌలింగ్ టీమ్ కెప్టెన్లు రివ్య్వూలు తీసుకోవ‌డాన్ని చూస్తూనే ఉంటాం. రివ్య్వూల ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌న్న సంగ‌తి కాస్త పక్క‌న బెడితే.. రివ్య్వూ తీసుకునేట‌ప్పుడు స‌ద‌రు కెప్టెన్ త‌న టీమ్‌లోని బౌల‌ర్‌, కీప‌ర్‌తో పాటు స‌మీపంలోని ఫీల్డ‌ర్ల అభిప్రాయాల‌ను తీసుకుంటాడు. కానీ పాకిస్థాన్ కొత్త కెప్టెన్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ మాత్రం ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్ స‌ల‌హా తీసుకుని రివ్య్వూకి వెళ్లాడు. ఇంక ఫ‌లితం గురించి చెప్పేది ఏముంది. పాక్ ఓ రివ్వ్యూ ను కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అడిలైడ్ వేదిక‌గా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డే మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొద‌ట బ్యాటింగ్ చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్ 34వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. న‌సీమ్ షా వేసిన బౌన్స‌ర్‌ను ఆసీస్ బ్యాట‌ర్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే.. బాల్ వికెట్ కీప‌ర్ రిజ్వాన్ చేతుల్లోకి వెళ్లింది. వెంట‌నే రిజ్వాన్ ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. అత‌డు కాకుండా మ‌రే పాక్ ప్లేయ‌ర్ అప్పీల్ చేయ‌లేదు.

West Indies : ప్లేయ‌ర్ పై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీరియ‌స్‌.. రెండు మ్యాచుల నిషేదం..

రిజ్వాన్ బౌల‌ర్ వైపు వెలుతూ రివ్వ్యూ తీసుకోమంటావా? అని బ్యాట‌ర్ జంపాను అడిగాడు. దీంతో తాను ఔట్ కాద‌ని అత‌డికి తెలుసుగ‌దా? పైగా రివ్య్యూ వేస్ట్ చేయాల‌న్న ఉద్దేశ్యంతో జంపా తీసుకోమ‌ని చెప్పాడు. వెంట‌నే రిజ్వాన్ రివ్య్వూ తీసుకున్నాడు. రిప్లే ప‌రిశీలించిన త‌రువాత థ‌ర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా.. పాక్ కెప్టెన్ తెలివితేట‌లు చూసి కామెంటేట‌ర్ల‌తో పాటు ప్ర‌తి ఒక్క‌రు న‌వ్వుకున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35 ఓవ‌ర్ల‌లో 163 ప‌రుగుల‌కు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (35) టాప్ స్కోర‌ర్‌. పాక్ బౌల‌ర్ల‌లో హారిస్ ర‌వూఫ్ ఐదు వికెట్లు తీశాడు. షాహిన్ అఫ్రిది మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. న‌సీమ్ షా, మొహమ్మద్‌ హస్నైన్ చెరో వికెట్ సాధించారు. అనంత‌రం ల‌క్ష్యాన్ని పాక్ 26.3 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోయి ఛేదించింది. ఓపెన‌ర్లు సైమ్‌ అయూబ్‌ (82; 71 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు) అబ్దుల్లా షఫీక్‌ (64 నాటౌట్‌; 69 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు.

Mohammad Nabi: అఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ కీలక ప్రకటన.. ఛాంపియన్స్ ట్రోపీ తరువాత..

రెండో వ‌న్డేలో పాక్ గెల‌వ‌డంతో మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ప్ర‌స్తుతం 1-1తో స‌మ‌మైంది. నిర్ణయాత్మకమైన మూడో పెర్త్‌ వేదికగా వన్డే నవంబర్‌ 10న జరుగనుంది.