West Indies : ప్లేయర్ పై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీరియస్.. రెండు మ్యాచుల నిషేదం..
వెస్టిండీస్ స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ షాకిచ్చింది.

Alzarri Joseph suspended after on field argument with his captain
West Indies : వెస్టిండీస్ స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ షాకిచ్చింది. అతడిపై రెండు మ్యాచుల నిషేదాన్ని విధించింది. మైదానంలో కెప్టెన్ షై హోప్‌తో అల్జారీ జోసెఫ్ గొడవ పడడమే అందుకు కారణం. కెప్టెన్‌తో గొడవ పడడం పై విండీస్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదని చెప్పింది. ఈ క్రమంలోనే క్రమశిక్షణా చర్యల్లో భాగంగా జోసెఫ్ పై రెండు మ్యాచుల బ్యాన్ విధించింది.
అసలేం జరిగిందంటే..?
బార్బడోస్ వేదికగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్‌ను అల్జారీ జోసెఫ్ వేశాడు. మొదటి బంతి వేసిన తరువాత ఫీల్డింగ్ సెటప్‌పై జోసెఫ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. కెప్టెన్ షై హోప్‌తో గొడవకు దిగాడు. ఈ ఓవర్‌లోని నాలుగో బంతిని బౌన్సర్‌గా వేసి ఇంగ్లీష్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్ (1)ను ఔట్ చేశాడు.
Mohammad Nabi: అఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ కీలక ప్రకటన.. ఛాంపియన్స్ ట్రోపీ తరువాత..
ఆ సమయంలో కెప్టెన్ హోప్‌తో సంబరాలు చేసేందుకు నిరాకరించాడు. అప్పుడు కూడా కెప్టెన్‌తో ఘాటుగా మాట్లాడాడు. మరో రెండు బంతులు వేసి ఓవర్ పూర్తి కాగానే మైదానం విడిచి వెళ్లి డగౌట్‌లో కూర్చుండి పోయాడు. దీంతో వెస్టిండీస్ కాసేపు 10 మందితోనే ఆడింది.
కోచ్ డారెన్ సామీ వెళ్లి జోసెఫ్‌తో మాట్లాడాడు. అతడికి సర్థి చెప్పాడు. దీంతో అల్జారీ జోసెఫ్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. తన 10 ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. 45 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. జోసెప్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కోచ్ డారెన్ సామీతో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు మండిపడ్డారు.
కాగా.. ఈ ఘటనపై అల్జారీ జోషెఫ్ స్పందించాడు. సహచరులకు, టీమ్ మేనేజ్మెంట్‌కు క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికి దీనిని విండీస్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే అతడిపై రెండు మ్యాచుల నిషేదాన్ని విధించింది.
IND vs SA: రోహిత్ శర్మను చూసి ఆ విషయాన్ని నేర్చుకున్నా : సూర్యకుమార్ యాదవ్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 263 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(74) డాన్ మౌస్లీ(57) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం లక్ష్యాన్ని విండీస్ 43 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్రాండన్ కింగ్(102), కీసీ కార్టీ( 128 నాటౌట్) శతకాలతో రాణించారు.
Alzarri Joseph was a very angry man yesterday.
Here is a Rip-Snorter. pic.twitter.com/vzKEhP51OI— Anirudh Kalra (@CricketKalra) November 7, 2024