Mohammad Nabi: అఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ కీలక ప్రకటన.. ఛాంపియన్స్ ట్రోపీ తరువాత..
39ఏళ్ల మహ్మద్ నబీ అఫ్గానిస్థాన్ తరపున మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. అందులో 33 పరుగులు చేశాడు. ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.

Mohammad Nabi
Afghanistan Star Allrounder Mohammad Nabi : అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ కీలక ప్రకటన చేశాడు. వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోపీ తరువాత వన్డే క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. నవీ రిటైర్మెంట్ ను అఫ్గానిస్థాన్ క్రికెట బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నసీబ్ ఖాన్ శుక్రవారం క్రిక్‌బజ్ తో మాట్లాడుతూ ధృవీకరించారు. ‘అవును, ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత నబీ వన్డే ఫార్మాట్ కు రిటైర్ అవుతున్నాడు. అతను తన నిర్ణయాన్ని బోర్డు తెలియజేశాడు. ఛాంపియన్స్ ట్రోపీ తరువాత తన వన్డే కెరీర్ ను ముగించాలని అనుకుంటున్నట్లు అతను కొన్ని నెలల క్రితం నాకు చెప్పాడని నసీబ్ ఖాన్ పేర్కొన్నాడు. అతని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అన్నాడు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత నబీ T20 కెరీర్‌ను కొనసాగించాలని భావిస్తున్నానని నసీబ్ ఖాన్ పేర్కొన్నాడు.
Also Read: IND vs SA: రోహిత్ శర్మను చూసి ఆ విషయాన్ని నేర్చుకున్నా : సూర్యకుమార్ యాదవ్
మహ్మద్ నబీ 2009లో స్కాట్‌లాండ్‌పై తన వన్డే అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్ లోనే అర్ధ సెంచరీ చేశాడు. ఇప్పటి వరకు నబీ మొత్తం 165 వన్డే మ్యాచ్ లు ఆడగా.. 27.30 సగటుతో 3,549 పరుగులు చేశాడు. 171 వికెట్లు కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం యూఏఈలో బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో నబీ ఆడుతున్నాడు. మహ్మద్ నబీ 2019లో టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయిన విషయం తెలిసిందే.
39ఏళ్ల మహ్మద్ నబీ అఫ్గానిస్థాన్ తరపున మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. అందులో 33 పరుగులు చేశాడు. ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఇదిలాఉంటే.. 129 టీ20 మ్యాచ్ లు ఆడిన నబీ.. 2,165 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీ20 ఫార్మాట్ లో 96 వికెట్లు పడగొట్టాడు.