SA vs IND : భారత్ పై విజయం.. దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్ కామెంట్స్ వైరల్.. తలెత్తుకునే ప్రదర్శన
రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Markram comments after Win Over India in 2nd t20
SA vs IND : రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా నాలుగు మ్యాచుల టీ20 సిరీస్‌లో 1-1తో నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులుచేసింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా (39 నాటౌట్) రాణించాడు. అక్షర్ పటేల్ (27), తిలక్ వర్మ (20) లు ఫర్వాలేదనిపించారు. దక్షిణాప్రికా బౌలర్లలో మార్కో జేన్సన్, కొయెట్జీ, సిమలెనే, మార్క్‌రమ్, పీటర్ తలో వికెట్ తీశారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 19 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి అందుకుంది. సపారీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్ (47 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరల్లో గెరాల్డ్ కొయెట్జీ (9 బంతుల్లో 19 నాటౌట్) వేగంగా పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో సత్తా చాటాడు.
SA vs IND : మ్యాచ్ ఓడిపోయినా.. అరుదైన ఘనత సాధించిన వరుణ్ చక్రవర్తి.. 33 ఏళ్ల వయసులో..
ఇక మ్యాచ్ గెలిచిన తరువాత దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్ మాట్లాడాడు. మ్యాచ్ గెలవడం ఆనందంగా ఉందన్నాడు. బౌలర్లు తమ ప్రణాళికలను చక్కగా అమలు చేశారన్నాడు. అయితే.. లక్ష్య ఛేదన గొప్పగా సాగలేదన్నాడు. ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోవడాన్ని బాధించిందన్నాడు. అయినప్పటికి అంతిమంగా మా బ్రాండ్ క్రికెట్ ఆడాం. తలెత్తుకునేలా ప్రదర్శన చేశామన్నాడు. ముఖ్యంగా స్టబ్స్, కొయెట్జీ ఆఖరల్లో వేగంగా ఆడారన్నాడు.
సిరీస్ గురించి ఆలోచించడం లేదన్నాడు. ఒక్కొ మ్యాచ్ పైనే దృష్టి పెట్టినట్లు వెల్లడించాడు. తన గాయం గురించి మాట్లాడుతూ.. తాను బాగానే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఫీల్డింగ్ చేస్తుండగా మార్‌క్రమ్ వేలికి గాయమైంది.
IND vs SA: సౌతాఫ్రికాపై టీమిండియా ఓటమి.. వారివల్లనే ఓడిపోయామన్న కెప్టెన్ సూర్య
ఇక ఇరు జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా బుధవారం మూడో టీ20 జరగనుంది.