Syazrul Idrus
Pacer Syazrul Idrus : టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర నమోదైంది. మలేసియా ఫాస్ట్ బౌలర్ సియాజ్రుల్ ఇడ్రస్ (Syazrul Idrus) అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు కాదు ఐదు కాదు ఆరు కాదు ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2024 ఆసియా రీజినల్ క్వాలిఫైయర్ B టోర్నమెంట్‌లో అతడు సంచలన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలో నైజీరియా ఆటగాడు పీటర్ అహో (6/5) పేరిట ఉన్న రికార్డును 32 ఏళ్ల ఇడ్రస్ బద్దలు కొట్టాడు.
బయుమాస్ ఓవల్‌లో చైనా, మలేషియా జట్ల మధ్య బుధవారం (జూలై 26) టీ20 మ్యాచ్ జరిగింది. తొలుత చైనా బ్యాటింగ్ చేసింది. సియాజ్రుల్ ఇడ్రస్ ధాటికి 11.2 ఓవర్లలో 23 పరుగులకే కుప్పకూలింది. ఇడ్రస్ నాలుగు ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఏడు వికెట్లు తీశాడు. అతడు పడగొట్టిన వికెట్లు అన్ని క్లీన్ బౌల్డ్‌లే కావడం విశేషం. అతడితో పాటు వన్‌దీప్ సింగ్ (4-0-9-2), విజయ్ ఉన్ని (1.2-1-1-1) రాణించడంతో చైనా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఏకంగా ఆరుగురు చైనా బ్యాటర్లు డకౌట్ అయ్యారు.
PV Sindhu : తెలుగు తేజానికి ఏమైంది..? మళ్లీ తొలి రౌండ్‌లోనే సింధు ఓటమి.. ఈ ఏడాదిలో ఇది 7వ సారి
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని మలేషియా 4.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో మలేషియా ఓపెనర్లు ఇద్దరు డకౌట్ అయ్యారు. అయితే.. విరన్ దీప్ సింగ్ (19 నాటౌట్), షార్వీన్ సురేంద్రన్(4) నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు.
అంతర్జాతీయ టీ20ల్లో బౌలింగ్‌లో టాప్-10 అత్యుత్తమ గణాంకాలు
* సియాజ్రుల్ ఇడ్రస్ (మలేసియా) 7/8
* పీటర్ అహో (నైజీరియా) 6/5
* దీపక్ చాహర్ (భారత్) 6/7
* నక్రాని (ఉగాండ) 6/7
* అజంతా మెండిస్ (శ్రీలంక) 6/8
* జెజె స్మిట్ (నమీబియా) 6/10
* అజంతా మెండిస్ (శ్రీలంక) 6/16
* ఓబెడ్ మెక్‌కాయ్ (వెస్టిండీస్) 6/17
* లాంగట్ (కెన్యా) 6/17
* ఫెన్నెల్ (అర్జెంటీనా) 6/18
Malaysia’s Syazrul Idrus produced the best bowling figures in Men’s T20I history ?
More ➡️ https://t.co/uyVbXc9rfQ pic.twitter.com/6XLqIQGnnh
— ICC (@ICC) July 26, 2023