IND vs AFG : అఫ్గానిస్థాన్‌ చిత్తు.. 47 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం..

IND vs AFG : టీ20 ప్రపంచ్ కప్ 2024లో సూపర్ 8లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా 47 పరుగుల తేడాతో విజయం సాధించింది.

IND vs AFG : టీ20 ప్రపంచ్ కప్ 2024లో సూపర్ 8లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్‌సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగుల చేసింది.

భారత్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అఫ్గాన్ జట్టు 20 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో లక్ష్య ఛేదనలో అఫ్గాన్ ఆటగాళ్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. ఒకరి తర్వాత మరొకరు పేలవ ప్రదర్శనతో పెవిలియన్ బాట పట్టేశారు. భారత్ బౌలర్ల దెబ్బకు అఫ్గాన్ చిత్తుగా ఓడింది.

అఫ్గాన్ ఆటగాళ్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) టాప్ స్కోరు చేయగా, నజీబుల్లా జద్రాన్ (19), గుల్భాదిన్ నాయబ్ (17), రహ్మానుల్లా గుర్భాజ్ (11), మహమ్మద్ నబీ (14), నూర్ అహ్మద్ (12) పరుగుల చేయగా, ఇబ్రహీం జద్రాన్ (8), హజ్రతుల్లా జజాయ్ (2), కెప్టెన్ రషీద్ ఖాన్ (2), ఫజల్హక్ ఫారూఖీ (4 నాటౌట్) సింగిల్ డిజిట్‌‌కే పరిమితమయ్యారు.

భారత్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్ (2), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు. భారత్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

అఫ్గానిస్థాన్ టార్గెట్ 182
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 181 ప‌రుగులు చేసింది. భారత బ్యాట‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ (53; 28 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ బాదాడు. హార్దిక్ పాండ్య‌(32; 24 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్స‌ర్లు) లు రాణించారు. అఫ్గానిస్తాన్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్, ఫజల్హక్ ఫరూఖీ చెరో మూడు వికెట్లు తీశారు. నవీన్ ఉల్ హ‌క్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

సూర్య‌కుమార్ యాద‌వ్ హాఫ్ సెంచ‌రీ.. ఆ వెంట‌నే ఔట్‌
ఫజల్హక్ ఫరూఖీ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 27 బంతుల్లో సూర్య‌కుమార్ యాద‌వ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మ‌రుస‌టి బంతికే మ‌హ్మ‌ద్ న‌బీ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 16.6వ ఓవ‌ర్‌లో 150 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

శివ‌మ్‌దూబె ఔట్‌.. 
టీమ్ఇండియా మ‌రో వికెట్ కోల్పోయింది. ర‌షీద్ ఖాన్ బౌలింగ్‌లో శివ‌మ్ దూబె (10) ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 10.5వ ఓవ‌ర్‌లో 90 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

విరాట్ కోహ్లి ఔట్‌.. 
ర‌షీద్ ఖాన్ మ‌రోసారి భార‌త్‌ను దెబ్బ కొట్టాడు. మ‌హ్మ‌ద్ న‌బీ క్యాచ్ అందుకోవ‌డంతో విరాట్ కోహ్లి(24) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 8.3వ ఓవ‌ర్‌లో 62 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

రిష‌బ్ పంత్ ఔట్‌..
టీమ్ఇండియా మ‌రో వికెట్ కోల్పోయింది. ర‌షీద్ ఖాన్ బౌలింగ్‌లో రిష‌బ్‌పంత్ (20) ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 6.6వ ఓవ‌ర్‌లో 54 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

ప‌వ‌ర్ ప్లే పూర్తి.. 
భార‌త ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే పూర్తి అయింది. 6 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 47/1. రిష‌బ్ పంత్ (19), విరాట్ కోహ్లి (17) క్రీజులో ఉన్నారు.

రోహిత్ శ‌ర్మ ఔట్‌.. 
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌కు ఆదిలోనే షాక్ త‌గిలింది. ఫజల్హక్ ఫరూఖీ బౌలింగ్‌లో ర‌షీద్ ఖాన్ క్యాచ్ అందుకోవ‌డంతో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(8) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 2.5వ ఓవ‌ర్‌లో 11 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది.

భార‌త తుది జ‌ట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జ‌స్‌ప్రీత్‌ బుమ్రా

అఫ్గానిస్తాన్ తుది జ‌ట్టు : రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీప‌ర్‌), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మ‌హమ్మద్ నబీ, రషీద్ ఖాన్(కెప్టెన్‌), నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫరూఖీ

India vs Afghanistan : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 సూప‌ర్ 8లో భాగంగా బార్బ‌డోస్ వేదిక‌గా భార‌త్, అఫ్గానిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. సూప‌ర్‌8లో ఇరు జ‌ట్ల‌కు ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిచి సూప‌ర్‌8లో ఘ‌నంగా బోణీ కొట్టాల‌ని ఇరు జ‌ట్లు ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. కాగా.. టీమ్ఇండియా టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు