భార‌త్‌తోపాటు అఫ్గానిస్థాన్ జట్టు సెమీస్‌కు వెళ్లాలంటే ఏం చేయాలి?

భారత్ జట్టు 4పాయింట్లతో దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈనెల 24న రాత్రి 8గంటలకు (భారత్ కాలమానం ప్రకారం) ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.

T20 World Cup 2024

T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. సూపర్ -8 విభాగం గ్రూప్-1లో ఆస్ట్రేలియా జట్టును అఫ్గానిస్థాన్ జట్టు ఓడించి సంచలనం సృష్టించింది. ఆదివారం ఉదయం అఫ్గాన్ వర్సెస్ ఆసీస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 148 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 19.2 ఓవర్లలో 127 పరుగులు మాత్రమేచేసి ఆలౌట్ అయింది. దీంతో 21 పరుగుల తేడాతో ఆసీస్ పై అఫ్గానిస్థాన్ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియాపై అఫ్గాన్ విజయంతో గ్రూప్-1 నుంచి సెమీస్ కు ఏ రెండు జట్లు వెళ్తాయన్న ఉత్కంఠ నెలకొంది.

Also Read : టీ20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం.. ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ జట్టు విజయం

సూపర్ -8 విభాగం గ్రూప్-1 లో భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ఒక్కో జట్టు మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే ఒక్కో జట్టు రెండేసి మ్యాచ్ లు ఆడాయి. భారత్ జట్టు ఆడిన రెండు మ్యాచ్ లలో రెండింటిలోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ జట్లు రెండు మ్యాచ్ లలో ఒక్కో మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండు పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ జట్టు ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయి సెమీస్ అవకాశాలను కోల్పోయింది.

Also Read : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచకప్‌లో అలాచేసిన తొలి బ్యాట్స్‌మెన్‌ అతనే..

  • భారత్ జట్టు 4పాయింట్లతో దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈనెల 24న రాత్రి 8గంటలకు (భారత్ కాలమానం ప్రకారం) ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈనెల 25న ఉదయం 6గంటలకు (భారత కాలమానం ప్రకారం) అఫ్గానిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.
  • భారత్ జట్టుపై ఆస్ట్రేలియా విజయం సాధించి బంగ్లా దేశ్ జట్టు పై అఫ్గానిస్థాన్ జట్టు ఓడిపోతే ఆసీస్ జట్టు సెమీస్ లోకి దూసుకెళ్తుంది. అలాకాకుండా.. భారత్ జట్టుపై ఆస్ట్రేలియా ఓడిపోయి.. బంగ్లాదేశ్ జట్టుపై అఫ్గానిస్థాన్ గెలిస్తే.. అఫ్గాన్ జట్టు సెమీస్ లోకి దూసుకెళ్తుంది.
  • ఆస్ట్రేలియా, అఫ్గాన్ జట్లు తమ ప్రత్యర్థి జట్లపై (భారత్, బంగ్లాదేశ్) ఓడితే ఇరు జట్లకు పాయింట్లు సమానంగా ఉంటాయి. దీంతో రన్ రేట్ కీలకంగా మారనుంది. ఆస్ట్రేలియా (+0.223), అప్గానిస్థాన్ (-0.650) నెట్ రన్ రేటును కలిగి ఉన్నాయి. రన్ రేటు విషయంలో ఆస్ట్రేలియాదే పైచేయిగా ఉంది.
  • వర్షం కారణంగా రెండు జట్ల మ్యాచ్ లు రద్దయినా రన్ రేటు మెరుగ్గాఉన్న ఆస్ట్రేలియా జట్టుకే సెమీస్ కు వెళ్లే అవకాశాలు ఉంటాయి.
  • ఆస్ట్రేలియా – భారత్ మ్యాచ్ రద్దయ్యి.. బంగ్లాపై అఫ్గాన్ గెలిస్తే భారత్ జట్టుతో పాటు అఫ్గానిస్థాన్ సెమీస్ లోకి దూసుకెళ్తుంది. అదే అఫ్గాన్ ఓడిపోతే.. ఆస్ట్రేలియాకు సెమీస్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
  • ఆస్ట్రేలియాపై భారత్ ఓడిపోయి.. బంగ్లాపై అఫ్గానిస్థాన్ జట్టు విజయం సాధిస్తే.. భారత్, ఆస్ట్రేలియా, అఫ్గాన్ జట్లు పాయింట్ల పట్టికలో సమఉజ్జీలుగా ఉంటాయి. ఆ సమయంలోనూ రన్ రేట్ కీలకంగా మారనుంది.
  • ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప..  భారత్ జట్టు సెమీఫైనల్ కు వెళ్లడం దాదాపు ఖాయమైంది.
  • మొత్తానికి ఆస్ట్రేలియాపై అఫ్గాన్ సంచలన విజయంతో గ్రూప్- 1 నుంచి సెమీస్ కు భారత్ జట్టుతోకలిసి వెళ్లే జట్టు ఏదో తేలాలంటే మిగిలిన రెండు మ్యాచ్ లు పూర్తయ్యే వరకు ఆగాల్సిందే.

 

 

ట్రెండింగ్ వార్తలు