×
Ad

IND vs ZIM : క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. భార‌త్ వ‌ర్సెస్ జింబాబ్వే మ్యాచ్ ఎఫెక్ట్‌.. మెట్రోలో ఉచిత ప్ర‌యాణం

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 సూప‌ర్‌-8లో భాగంగా గురువారం భార‌త్, జింబాబ్వే జ‌ట్ల (IND vs ZIM) మ‌ధ్య కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

T20 World Cup 2026 Chennai metro announce free rides for fans attending IND vs ZIM clash

  • చెపాక్ వేదిక‌గా గురువారం భార‌త్ వ‌ర్సెస్ జింబాబ్వే మ్యాచ్‌
  • మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించే వారికి శుభ‌వార్త‌
  • మెట్రోలో ప్ర‌యాణం ఉచితం

IND vs ZIM : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 సూప‌ర్‌-8లో భాగంగా గురువారం భార‌త్, జింబాబ్వే జ‌ట్ల మ‌ధ్య కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో ఈ మ్యాచ్‌ను మైదానంలో ప్ర‌త్య‌క్షంగా వీక్షించే వారికి చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ శుభ‌వార్త చెప్పింది. మ్యాచ్ చూసేందుకు వెళ్లేవారు మెట్రో రైళ్ల‌లో ఉచితంగా ప్ర‌యాణించ‌వ‌చ్చున‌ని తెలిపింది. మ్యాచ్ టికెట్లు ఉన్న‌వారు ఒక‌సారి వెళ్లి రావొచ్చు.

‘టీ20 పురుషుల ప్రపంచ కప్ 2026 యొక్క సూపర్ 8 మ్యాచ్‌కు హాజరయ్యే అభిమానులు సజావుగా, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA)తో ప్రత్యేక సహకారాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది. భారతదేశం వ‌ర్సెస్‌ జింబాబ్వే మ్యాచ్ 2026 ఫిబ్రవరి 26న‌ చెన్నైలోని చెపాక్ మైదానంలో జ‌ర‌గ‌నుంది. మ్యాచ్ టిక్కెట్లు (ప్రత్యేకమైన QR కోడ్‌లు) CMRL మెట్రో టిక్కెట్లుగా కూడా పనిచేస్తాయి. ఒక రౌండ్ ట్రిప్‌కు చెల్లు బాటు అవుతాయి. ‘అని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

IND vs ZIM : భార‌త్‌తో మ్యాచ్‌కు ముందు జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు.. ప్ర‌త్య‌ర్థిని ప‌ట్టించుకోం.. మా గేమ్ మాదే..

త‌ప్ప‌క గెల‌వాల్సిందే..
సూప‌ర్‌-8 తొలి మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికాతో చేతిలో ఘోర ప‌రాజ‌యం పాలైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో సెమీస్ ఆశ‌లు స‌జీవంగా ఉంచుకోవాలంటే జింబాబ్వే జ‌ట్టు పై టీమ్ఇండియా భారీ తేడాతో గెల‌వాల్సి ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం అప్పుడు భార‌త జ‌ట్టు సెమీస్ రేసు నుంచి నిష్ర్క‌మిస్తుంది.

T20 World Cup 2026 : ఏంది సామీ నువ్వు చెప్పేది.. ఇలా జ‌రిగితే నెట్‌ర‌న్‌రేటుతో భార‌త్‌కు సంబంధం లేదా? టీమ్ఇండియా పంట పండిన‌ట్లే!

మ‌రోవైపు జింబాబ్వే ప‌రిస్థితి కూడా భార‌త జ‌ట్టులాగానే ఉంది. గెలిస్తేనే సెమీస్ అవ‌కాశాలు ఉంటాయి. ఓడిపోతే ఇంటి ముఖం ప‌డుతుంది.