Jasprit Bumrah
Jasprit Bumrah : టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం రాత్రి ఇండియా వర్సెస్ నమీబియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా పట్టిన క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : T20 World Cup 2026: హాఫ్ సెంచరీలు బాదిన ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా
ఈ మ్యాచ్‌లో తొలుత భారత జట్టు బ్యాటింగ్ చేసింది. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61), హార్దిక్ పాండ్య (28బంతుల్లో 52) రాణించగా.. మిగిలిన బ్యాటర్లు భారీ స్కోర్ రాబట్టడంలో విఫలమయ్యారు. చివరిలో టీమిండియా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాటపట్టడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 209 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా బ్యాటర్లు ప్రారంభంలో దూకుడుగా ఆడినప్పటికీ.. భారత్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో క్రమంగా ఔట్ అవుతూ వచ్చారు. దీంతో నమీబియా జట్టు 18.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయింది.
THE YORKER OF BUMRAH 🥶 pic.twitter.com/GGKMjooxdM
— Johns. (@CricCrazyJohns) February 12, 2026
ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఫీల్డింగ్ సమయంలో ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా సూపర్ క్యాచ్ అందుకున్నాడు. తన చురుకైన ఫీల్డింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అక్షర్ పటేల్ వేసిన 12.3 ఓవరకు నమీబియా బ్యాటర్ మలన్ క్రుగర్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి గాల్లోకిలేచి బౌండరీకి దగ్గరలో పడే సమయంలో జస్ర్పీత్ బ్రుమా వేగంగా రన్నింగ్ చేసుకుంటూ వచ్చి డ్రైవ్ చేసి బంతిని క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బుమ్రా క్యాచ్‌ను చూసిన నెటిజన్లు వావ్ అంటూ ప్రశంసిస్తున్నారు.
A STUNNIG CATCH BY THE GOAT – JASPRIT BUMRAH. 🤯👌 pic.twitter.com/6E0XhNdRpN
— Johns. (@CricCrazyJohns) February 12, 2026