×
Ad

T20 World Cup 2026 : దెబ్బకొట్టిన జింబాబ్వే.. గెలిచినా ఆందోళనలో టీమిండియా.. అలా జరిగితే సెమీస్ ఆశలు గల్లంతే..

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8లో భాగంగా గురువారం రాత్రి ఇండియా వర్సెస్ జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినప్పటికీ.. అనుకున్నంత విజయాన్ని నమోదు చేయలేకపోయింది.

T20 World Cup 2026

  • జింబాబ్వేపై విజయం సాధించిన టీమిండియా
  • 72పరుగుల తేడాతో ఘన విజయం
  • టీమిండియా సెమీస్ ఆశలు సజీవం
  • మార్చి 1న వెస్టిండీస్‌పై విజయం సాధిస్తే సెమీస్‌కు
  • వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే భారత్ ఇంటికే

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8లో భాగంగా గురువారం రాత్రి ఇండియా వర్సెస్ జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినప్పటికీ.. అనుకున్నంత విజయాన్ని నమోదు చేయలేకపోయింది. జింబాబ్వే గట్టిపోటీనే ఇచ్చింది. దీంతో, టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నప్పటికీ.. రన్ రేట్ పరంగా వెస్టిండీస్ కంటే టీమిండియా వెనుకబడి ఉంది.

Also Read : Sachin Tendulkar : అర్జున్‌, సానియా ప్రీ వెడ్డింగ్ వేడుక‌లు.. స‌చిన్ కామెంట్స్‌.. కొడుకు త‌ను ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చి..

గ్రూప్-1లో భాగంగా దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. వెస్టిండీస్ జట్టు రెండు మ్యాచ్‌లలో ఒక విజయంతో 1.791 రన్‌రేట్‌తో రెండో స్థానంలో ఉంది. భారత జట్టు రెండు మ్యాచ్‌లలో ఒక విజయంతో -0.100 రన్‌రేట్‌తో మూడో స్థానంలో నిలిచింది. మార్చి1న (ఆదివారం) టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తే ఆ జట్టు సెమీఫైనల్లోకి అడుగు పెడుతుంది. అయితే, ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే టీమిండియాకు సెమీస్ ఆశలు గల్లంతయినట్లే. రన్‌రేట్ ప్రకారం మెరుగ్గా ఉన్న వెస్టిండీస్ జట్టు సెమీఫైనల్లోకి అడుగు పెడుతుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైనా ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు.. జింబాబ్వేపై భారీ విజయాన్ని నమోదు చేసి రన్‌రేట్ పరంగా వెస్టిండీస్ జట్టు కంటే మెరుగ్గా ఉండాలని టీమిండియా భావించినప్పటికీ.. జింబాబ్వే జట్టు గట్టిపోటీని ఇచ్చి భారత లక్ష్యాన్ని అడ్డుకుంది.

గురువారం రాత్రి ఇండియా వర్సెస్ జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో.. ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 30 బంతుల్లోనే 55 రన్స్ చేశాడు. ఇషాన్ కిషన్ (38), సంజూ శాంసన్ (24), సూర్య‌కుమార్ యాదవ్ (33) రాణించారు. చివరలో హార్దిక్ పాండ్య, తిలక్ వర్మలు మెరుపు బ్యాటింగ్ చేశారు. పాండ్యా 23 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 16 బంతుల్లోనే 44 రన్స్ చేశాడు.

257 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 72 రన్స్ తేడాతో భారత్ విక్టరీ కొట్టింది. జింబాబ్వే జట్టులో ఓపెనర్ బెనెట్ ఒంటరి పోరాటం చేశాడు. 59 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ రజా 21 బంతుల్లో 31 రన్స్ చేశాడు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివమ్ దూబె తలో వికెట్ పడగొట్టారు.