×
Ad

T20 World Cup 2026 : రాణించిన న‌మీబియా బ్యాట‌ర్లు.. నెద‌ర్లాండ్స్ టార్గెట్ ఎంతంటే?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో (T20 World Cup 2026) భాగంగా నెద‌ర్లాండ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో న‌మీబియా బ్యాట‌ర్లు రాణించారు.

T20 World Cup 2026 Netherlands target is 159 runs

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా మంగ‌ళ‌వారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా న‌మీబియా, నెద‌ర్లాండ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న‌మీబియా జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 156 ప‌రుగులు చేసింది. దీంతో నెద‌ర్లాండ్స్ ముందు 157 పరుగుల ల‌క్ష్యం నిలిచింది.

T20 World Cup 2026 : తొల‌గిన అనిశ్చితి.. భార‌త్‌తో మ్యాచ్‌కు పాక్ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌.. బంగ్లాదేశ్‌కు ఐసీసీ బిగ్ ప్రామిస్‌..

 


న‌మీబియా బ్యాట‌ర్ల‌లో జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ (42; 38 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు), జాన్ ఫ్రైలింక్ (30; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. జేజే స్మిత్ (22), గెర్హార్డ్ ఎరాస్మస్ (18)లు ప‌ర్వాలేద‌నిపించారు. ఈ న‌లుగురు మిన‌హా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు.

T20 World Cup 2026 : పాక్‌కు యూఎస్ఏ ప్లేయ‌ర్ వార్నింగ్‌.. మ‌రోసారి ఓడిస్తాం.. మొహ్సిన్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌

నెద‌ర్లాండ్స్ బౌల‌ర్ల‌లో లోగాన్ వాన్ బీక్, బాస్ డి లీడే లు చెరో రెండు వికెట్లు తీశాడు. ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్ త‌లా ఓ వికెట్ సాధించారు.