×
Ad

T20 World Cup 2026 : దంచికొట్టిన బాస్ డి లీడే.. గెలుపు బోణీ కొట్టిన నెద‌ర్లాండ్స్.. న‌మీబియాపై ఘ‌న విజ‌యం..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో (T20 World Cup 2026) నెద‌ర్లాండ్స్ గెలుపు బోణీ కొట్టింది.

T20 World Cup 2026 Netherlands won by 7 wickets against Namibia

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో నెద‌ర్లాండ్స్ గెలుపు బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో పాక్ చేతిలో ఖంగుతిన్న నెద‌ర్లాండ్స్ జ‌ట్టు మంగ‌ళ‌వారం ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో న‌మీబియాపై ఏడు వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది.

157 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నెద‌ర్లాండ్స్ జ‌ట్టు 18 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. నెద‌ర్లాండ్స్ బ్యాట‌ర్ల‌లో బాస్ డి లీడే (72 నాటౌట్; 48 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అజేయ హాఫ్ సెంచ‌రీతో క‌దంతొక్కాడు.

T20 World Cup 2026 : పాక్‌కు యూఎస్ఏ ప్లేయ‌ర్ వార్నింగ్‌.. మ‌రోసారి ఓడిస్తాం.. మొహ్సిన్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌

కాలిన్ అకెర్మాన్ (32; 28 బంతుల్లో 1 సిక్స్‌), మైఖేల్ లెవిట్ (28; 15 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లు), స్కాట్ ఎడ్వర్డ్స్ (18 నాటౌట్; 9 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) రాణించారు. న‌మీబియా బౌల‌ర్ల‌లో బెర్నార్డ్ స్కోల్ట్జ్, రూబెన్ ట్రంపెల్మాన్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ లు త‌లా ఓ వికెట్ తీశారు.

T20 World Cup 2026 : పాక్‌కు యూఎస్ఏ ప్లేయ‌ర్ వార్నింగ్‌.. మ‌రోసారి ఓడిస్తాం.. మొహ్సిన్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌

అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన న‌మీబియా జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 156 ప‌రుగులు చేసింది. న‌మీబియా బ్యాట‌ర్ల‌లో జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ (42; 38 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు), జాన్ ఫ్రైలింక్ (30; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), జేజే స్మిత్ (22) లు రాణించారు. నెద‌ర్లాండ్స్ బౌల‌ర్ల‌లో లోగాన్ వాన్ బీక్, బాస్ డి లీడే లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్ త‌లా ఓ వికెట్ తీశారు.