×
Ad

T20 World Cup 2026 : అయ్యో.. ఆస్ట్రేలియా ప‌రిస్థితి మ‌రీ ఇలా అయిందేంటి? తొక్కి ప‌డేస్తాం.. అంటూ పసికూన కెప్టెన్ వార్నింగ్..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో (T20 World Cup 2026) భాగంగా నేడు (శుక్ర‌వారం ఫిబ్ర‌వ‌రి 20) ప‌ల్లెకెలె వేదిక‌గా ఆస్ట్రేలియా, ఒమ‌న్ జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి

T20 World Cup 2026 Oman captain Jatinder Singh warning to Australia

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా నేడు (శుక్ర‌వారం ఫిబ్ర‌వ‌రి 20) ప‌ల్లెకెలె వేదిక‌గా ఆస్ట్రేలియా, ఒమ‌న్ జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. ఇప్ప‌టికే ఈ రెండు జ‌ట్లు సూప‌ర్‌-8 రేసు నుంచి నిష్ర్క‌మించాయి.

ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒమ‌న్ ఓడిపోగా.. అన్నే మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్‌లో మాత్ర‌మే గెలిచింది. జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఆస్ట్రేలియా అనూహ్యంగా ప‌రాజ‌యం పాలైంది. ఈ నేప‌థ్యంలో ఆసీస్‌ను ఓడించేందుకు ఇదే స‌రైన స‌మ‌యం అని, ఆ జ‌ట్టుకు చుక్కలు చూపిస్తామ‌ని అంటున్నాడు ఒమ‌న్ కెప్టెన్ జ‌తీంద‌ర్ సింగ్‌.

T20 World Cup 2026 : జింబాబ్వే చేతిలో ఓట‌మిపై స్పందించిన శ్రీలంక కెప్టెన్.. నిజం చెప్పాలంటే

ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా తీవ్ర ఒత్తిడిలో ఉంద‌ని అన్నాడు. వ‌రుస ఓట‌ములతో ఆ జ‌ట్టు డీలా ప‌డింద‌ని చెప్పుకొచ్చాడు. ఆ బ‌ల‌హీన‌త‌ను తాము సొమ్ము చేసుకుంటామ‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశాడు. టీ20 అనేది మూమెంటం మీద న‌డిచే మ్యాచ్. ఆ రోజున మీరు స‌రిగ్గా ఆడితే మీదే విజ‌యం అని చెప్పుకొచ్చాడు.

ఒమ‌న్ మెరుగుప‌డాలంటే?

త‌మ జ‌ట్టు మెరుగుప‌డాలంటే.. త‌మ ప్లేయ‌ర్ల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌రిగే ఫ్రాంఛైజీ లీగుల్లో ఆడే అవ‌కాశాలు రావాల‌ని అన్నాడు. మిగిలిన టీమ్‌ల‌తో పోలిస్తే త‌మ జ‌ట్టు చాలా వెన‌క‌బ‌డి పోయింద‌న్నాడు. 2025లో ఒమ‌న్ చాలా త‌క్కువ మ్యాచ్‌లు ఆడింద‌ని చెప్పుకొచ్చాడు. మిగిలిన జ‌ట్లు త‌మ దేశానికి వ‌చ్చి మ్యాచ్‌లు ఆడితే త‌మ జ‌ట్టు కూడా మరింత మెరుగు అవుతుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశాడు.

Harmanpreet Kaur : చ‌రిత్ర సృష్టించిన హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌.. మ‌హిళ‌ల క్రికెట్‌లో ఏకైక ప్లేయ‌ర్..

కాగా.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో ఇప్ప‌టికే నిరాశ‌ప‌రిచిన ఆస్ట్రేలియా జ‌ట్టు క‌నీసం ఆఖ‌రి మ్యాచ్ ఒమ‌న్ పై భారీ విజ‌యం సాధించి గౌర‌వం కాపాడుకోవాల‌ని భావిస్తోంది.