T20 World Cup 2026 Scotland won by 73 runs against Italy
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో ఎట్టకేలకు స్కాట్లాండ్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయిన స్కాట్లాండ్ సోమవారం ఇటలీ పై భారీ విజయాన్ని సాధించింది. తద్వారా ఈ మెగాటోర్నీలో తొలి విజయాన్ని రుచిచూసింది.
208 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇటలీ జట్టు 16.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. దీంతో స్కాట్లాండ్ 73 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇటలీ బ్యాటర్లలో బెన్ మనేంటి (52; 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాప్ సెంచరీ చేశాడు. హ్యారీ మానేంటి (37; 25 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు.
Wanindu Hasaranga : మలింగ, రషీద్ ఖాన్, అఫ్రిది రికార్డులను బ్రేక్ చేసిన వనిందు హసరంగా..
మిగిలిన వారు విఫలం కాగా.. ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన కెప్టెన్ వేన్ మాడ్సెన్ బ్యాటింగ్‌కు దిగలేదు. స్కాట్లాండ్ బౌలర్లలో మైఖేల్ లీస్క్ నాలుగు వికెట్లు తీశాడు. మార్క్ వాట్ రెండు వికెట్లు పడగొట్టాడు. బ్రాడ్ క్యూరీ, బ్రాడ్ వీల్, ఆలివర్ డేవిడ్సన్ లు తలా ఓ వికెట్ సాధించారు.
Scotland open their #T20WorldCup account with a comprehensive victory in Kolkata 👏
📝: https://t.co/JzaZok1qmg pic.twitter.com/sHxcMIOIwT
— T20 World Cup (@T20WorldCup) February 9, 2026
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. స్కాట్లాండ్ బ్యాటర్లలో జార్జ్ మున్సే (84; 54 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్థశతకాన్ని బాదాడు. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (41 నాటౌట్; 18 బంతుల్లో 4 సిక్సర్లు) రాణించాడు. ఇటలీ బౌలర్లలో అలీ హసన్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా, జెజె స్మట్స్ తలా ఓ వికెట్ సాధించారు.