T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ ప్రత్యర్థులు ఖరారు.. భారత్ ఎవరితో తలపడనుందో తెలుసా? అన్ని జట్లు ఓ లెక్క ఈ జట్టు ఇంకో లెక్క.. టీమ్ఇండియాకు చుక్కలేనా?
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) సెమీస్‌కు చేరుకునే నాలుగు జట్లు ఏవో తేలిపోయాయి.
- Thota Vamshi Kumar
- Updated on- March 2, 2026 / 07:57 AM IST
T20 World Cup 2026 Semifinal lineups and venues confirmed
- టీ20 ప్రపంచకప్2026లో ముగిసిన సూపర్-8 దశ
- సెమీస్ చేరుకున్న భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 దశ ముగిసింది. వెస్టిండీస్‌పై అద్భుత విజయంతో భారత్ సెమీస్‌లో అడుగుపెట్టింది. మొత్తం 20 జట్లు టోర్నీలో అడుగుపెట్టగా.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, భారత్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి.
పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ నుంచి నిష్ర్కమించడంతో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు భారతదేశంలోనే జరుగుతాయి. నాలుగు జట్లు సెమీస్ చేరడంతో ఇప్పుడు వేదికలు, ఎవరితో ఎవరు తలపడనున్నారు అనే విషయాలు తెలిసిపోయాయి.
భారత్ ఎవరితో తలపడనుందంటే?
బుధవారం (మార్చి4న) తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గ్రూప్-1లో అగ్రస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ జట్టుతో ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదిక కానుంది.
ఇక గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచిన భారత జట్టు గురువారం (మార్చి 5న ) గ్రూప్-2లో అగ్రస్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముంబైలోని వాంఖడే మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది.
AUS-W vs IND-W : వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. మూడో వన్డేలో భారత్ పై ఘన విజయం..
ఈ రెండు మ్యాచ్‌లు కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. మార్చి 8 ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
