T20 World Cup: ఒకే గ్రూపులో దాయాది దేశాలు, ఇండియా Vs పాకిస్తాన్

మరి కొద్ది నెలల్లో జరగనున్న T20 World Cupకు సంబంధించిన షెడ్యూల్ లో దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ లను ఒకే గ్రూపులో చేర్చింది ఐసీసీ.

T20 World Cup: మరి కొద్ది నెలల్లో జరగనున్న T20 World Cupకు సంబంధించిన షెడ్యూల్ లో దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ లను ఒకే గ్రూపులో చేర్చింది ఐసీసీ. శుక్రవారం ఐసీసీ ఈవెంట్ సూపర్ 12 స్టేజ్ లో ఇరు దేశాలు రెండేళ్ల తర్వాత ఎదురెదురుగా తలపడనున్నట్లు పేర్కొంది. చివరి సారిగా 2019 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో మాత్రమే రెండు దేశాలు తలపడ్డాయి.

ఈ గ్రూపులో ఇండియా, పాకిస్తాన్ తో పాటు న్యూజిలాండ్, అఫ్ఘానిస్తాన్ తో పాటు మరో రెండు క్వాలిఫైయర్ దేశాలు రౌండ్ 1నుంచి పాల్గొంటాయి. ప్రతి గ్రూపు నుంచి రెండు టాప్ జట్లను సూపర్ 12కు ఎంపిక చేస్తారు.

’20 మార్చి 2021 వరకూ ఉన్న టీం ర్యాంకింగ్స్ ఆధారంగా గ్రూప్స్ ను సెలక్ట్ చేశారు. డిఫెంట్ ఛాంపియన్స్ వెస్టిండీస్ తో పాటు ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలను గ్రూప్ 1లో చేర్చినట్లు ఐసీసీ స్టేట్మెంట్ లో విడుదల చేసింది.

గ్రూపు 2లో ఇండియా, పాకిస్తాన్ , న్యూజిలాండ్, అఫ్ఘానిస్తాన్ లతో పాటు మరో రెండు క్వాలిఫైయర్ దేశాలు రౌండ్ 1తో తలపడతాయి. ఈ ఎనిమిది జట్లు తొలి రౌండ్ లో ఆటోమేటిక్ క్వాలిఫైయర్స్ అయిన శ్రీలంక, బంగ్లాదేశ్ తో పాటు మరో ఆరు దేశాలతో ఆడతాయి. ఐర్లాండ్, నెదర్లాండ్స్, నాంబియా, శ్రీలంకలు గ్రూప్ ఏలో ఆడనున్నాయి. ఒమన్, పీఎన్జీ, స్కాట్లాండ్ లు గ్రూపు బీలో ఉన్న బంగ్లాదేశ్ తో ఆడతాయి.

ట్రెండింగ్ వార్తలు