×
Ad

Team India : ‘మనల్ని ఎవడ్రా ఆపేది?’ సౌతాఫ్రికాపై విజయంతో ఇండియా ‘టాపర్ ఇన్ ద బ్యాచ్’

శుక్ర‌వారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో (Team India) భార‌త్ విజ‌యం సాధించింది

Team India big record Most consecutive bilateral series wins at home in men T20Is

Team India : శుక్ర‌వారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం సాధించింది. త‌ద్వారా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో కైవ‌సం చేసుకుంది. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా అరుదైన ఘ‌న‌త సాధించింది. స్వ‌దేశంలో వ‌రుస‌గా అత్య‌ధిక టీ20 సిరీస్‌లు గెలిచిన జ‌ట్టుగా చ‌రిత్ర సృష్టించింది.

ఈ క్ర‌మంలో ఆస్ట్రేలియాను అధిగ‌మించింది. స్వ‌దేశంలో ఆస్ట్రేలియా 2006 నుంచి 2010 వ‌ర‌కు వ‌రుస‌గా 8 ద్వైపాక్షిక్ష టీ20 సిరీస్‌ల‌లో విజ‌యం సాధించింది. ఇక భార‌త జ‌ట్టు విష‌యానికి వ‌స్తే.. 2022 నుంచి నేటి వ‌ర‌కు వ‌రుస‌గా 9 ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల‌ల్లో విజ‌యం సాధించింది.

IND vs SA : సూర్య‌కుమార్ యాద‌వ్ కామెంట్స్‌.. సిరీస్ గెలిచాం కానీ.. అదొక్క‌టే ..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 231 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో తిల‌క్ వ‌ర్మ (73; 42 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్ పాండ్యా (63 ;25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) లహాఫ్ సెంచ‌రీలు చేశారు. సంజూ శాంస‌న్ (37), అభిషేక్ శ‌ర్మ (34) లు రాణించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో కార్బిన్ బోష్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ఒట్నీల్ బార్ట్‌మాన్, జార్జ్ లిండే లు చెరో ఓ వికెట్ సాధించారు.

IND vs SA : ఐదో టీ20లో ఓట‌మి.. దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్ర‌మ్ సంచల‌న వ్యాఖ్య‌లు.. సిరీస్ పోతే పోయింది.. మా ల‌క్ష్యం అదొక్క‌టే..

ఆ త‌రువాత క్వింట‌న్ డికాక్ (65; 35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) అర్థ‌శత‌కం చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ (31; 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) వేగంగా ఆడిన‌ప్ప‌టికి కూడా ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల న‌ష్టానికి 201 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. టీమ్ఇండియా 30 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి నాలుగు, జ‌స్‌ప్రీత్ బుమ్రా రెండు, అర్ష్‌దీప్ సింగ్‌, హార్దిక్ పాండ్యాలు త‌లా ఓ వికెట్ సాధించారు.