Teamindia : జనవరి 19 టీమ్ఇండియాకు చాలా ప్రత్యేకమైన రోజు.. ఎందుకో తెలుసా? ఈ వీడియోలు చూడండి..

2008 జనవరి 19 తరువాత సరిగ్గా 13ఏళ్లకు టీమిండియా ఆస్ట్రేలియాకు మళ్లీ గుణపాఠం చెప్పింది. 2021 జనవరి 19న బ్రిస్బేన్ లోని గాబా మైదానంలో టీమ్ఇండియా అద్భుత విజయం సాధించింది.

Team india

India Vs Australia 2021 Test match in Gabba : టీమిండియా చరిత్రలో జనవరి 19వ తేదీ గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే .. 2021 జనవరి 19న ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మరీ ముఖ్యంగా.. గబ్బా స్టేడియంలో 32ఏళ్ల తరువాత టెస్టు మ్యాచ్ లో విజయం సాధించి ఆస్ట్రేలియా గర్వానికి టీమిండియా ధీటుగా సమాధానం ఇచ్చింది. జనవరి 19న ఒకటి కాదు.. టీమిండియా ఒకే తేదీన రెండు మ్యాచ్ లు గెలిచింది. ఆ రెండు విజయాలు చాలా ప్రత్యేకమైనవి. ఆ రెండు మ్యాచ్ లు కూడా ఆస్ట్రేలియా పొగరును అణిచేసినవే.

Also Read : సూప‌ర్ ఓవ‌ర్‌లో రోహిత్ శ‌ర్మ తొండాట‌..! ఆకాశ్ చోప్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

2008 జనవరి 19న పెర్త్ లోని డబ్ల్యూఏసీఏ క్రికెట్ స్టేడియంలో టీమిండియా అరుదైన రికార్డు సాధించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా బంతులు దూసుకొచ్చే క్రికెట్ స్టేడియంగా పేరుంది. ఈ మైదానంలో అప్పుడు టీమిండియా గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. అప్పటి మ్యాచ్ కు అనిల్ కుంబ్లే కెప్టెన్సీగా ఉన్నారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీమిండియా 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. పెర్త్ వేదికగా తొలిసారి ఆస్ట్రేలియాపై టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది.

Also Read : Virat Kohli : విరాట్ కోహ్లీ అద్భుత బౌండరీ సేవ్‌పై ఆనంద్ మహీంద్రా.. ‘హలో, ఐజాక్ న్యూటన్?’

2008 జనవరి 19 తరువాత సరిగ్గా 13ఏళ్లకు టీమిండియా ఆస్ట్రేలియాకు మళ్లీ గుణపాఠం చెప్పింది. 2021 జనవరి 19న బ్రిస్బేన్ లోని గాబా మైదానంలో్ టీమిండియా అద్భుత విజయం సాధించింది. గాబాలో టీమిండియా అట్టాంటి .. ఇట్టాంటి విజయం కాదు.. చరిత్రలో గుర్తుండిపోయే విజయం సాధించింది. జట్టులో సీనియర్ ప్లేయర్స్ లేకున్నా.. రెగ్యూలర్ కెప్టెన్ కోహ్లీ గైర్హాజరైన.. అజింక్య రహానే సారథ్యంలో యువ ప్లేయర్లు చెలరేగిపోయారు. టీమిండియా గెలుపు తీరాలకు చేర్చడమే కాకుండా బోర్డర్ గవాస్కర్ ట్రోపీని గెలుపొందారు. నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా.. సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. గబ్బాలో టీమిండియా తొలి విజయం సాధించడంతో పాటు.. 32ఏళ్ల తరువాత గబ్బాలో ఆస్ట్రేలియాను ఒడించింది. దీంతో పాటు వరుసగా రెండో టెస్టు సిరీస్ ను కూడా భారత్ కైవసం చేసుకుంది. గబ్బాలో జరిగిన నాల్గో టెస్టు లో రిషబ్ పంత్ (89 నాటౌట్) హీరోగా నిలిచాడు.