Teamindia : క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో టీమిండియా రెండు మ్యాచ్‌లు.. తేదీలు ఇవే.. విశాఖలో మాత్రం..
Teamindia : స్వదేశంలో భారత క్రికెట్ జట్టు 2026-27 సీజన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్ వేదికగా భారత జట్టు రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు అడనుంది.
- Harishth Thanniru
- Published On : March 27, 2026 / 07:09 AM IST
Team India
- స్వదేశంలో భారత క్రికెట్ జట్టు 2026–27 సీజన్ షెడ్యూల్ విడుదల
- హైదరాబాద్ వేదికగా రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు
- వెస్టిండీస్‌తో టి20 మ్యాచ్, జింబాబ్వేతో వన్డే మ్యాచ్
Teamindia : స్వదేశంలో భారత క్రికెట్ జట్టు 2026-27 సీజన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గురువారం సాయంత్రం విడుదల చేసింది. మొత్తం 17 వేదికల్లో 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లతో 9 వన్డేలు, 8 టీ20లు, 5 టెస్టులను భారత జట్టు స్వదేశంలో ఆడనుంది.
టీమిండియా 2026-27 సీజన్లో హైదరాబాద్ వేదికగా రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు అడనుంది. ఈ ఏడాది అక్టోబర్ 14న ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో భారత్ టి20 మ్యాచ్ ఆడనుండగా … వచ్చే ఏడాది జనవరి 6న జింబాబ్వేతో వన్డే మ్యాచ్ జరగనుంది. మిగతా మ్యాచ్ లకు వరుసగా త్రివేండ్రం, గుహవాటి, చండీగఢ్, లఖ్‌నవూ, రాంచీ, ఇండోర్, బెంగళూరు వెదికలుగా నిలవనున్నాయి. గత కొంతకాలంగా కీలక మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తున్న విశాఖపట్టణానికి 2026-27 సీజన్లో ఒక్కటి కూడా కేటాయించలేదు.
సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో పర్యటనతో భారత హోం సీజన్ ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌తో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. వన్డేలకు త్రివేండ్రం, గౌహతి, న్యూ ఛండీగడ్‌లు, టీ20లకు లక్నో, రాంచీ, ఇండోర్, హైదరాబాద్‌లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. డిసెంబర్‌లో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటించనుంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. వన్డేలకు ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌లు టీ20లకు రాజ్‌కోట్, కటక్, పూణేలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
వచ్చే ఏడాది (2027) జనవరిలో జింబాబ్వేతో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. ఆ తరువాత ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. భారత్–ఆ్రస్టేలియా మధ్య వచ్చే ఏడాది జనవరి 21 నుంచి ప్రతిష్టాత్మక ‘బోర్డర్ –గావస్కర్’ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. 1979లో చివరిసారిగా భారత్, ఆ్రస్టేలియా మధ్య భారత్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగగా… మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఇరు జట్లు మన దేశంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడనున్నాయి.
మరోవైపు.. టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వన్డే మ్యాచ్ లలో అభిమానులను అలరించనున్నారు. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వారు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం వన్డే మ్యాచ్ లలో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ సీజన్లో స్వదేశంలో తొమ్మిది వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. వీటిలో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే జట్లతో భారత జట్టు వన్డే సిరీస్ లు ఆడనుంది. ఈ మ్యాచ్ లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులను అలరించనున్నారు.
— BCCI (@BCCI) March 26, 2026
