Ishan Kishan : కాస్త క‌ష్ట‌మే కానీ.. వెస్టిండీస్‌తో ఐదో టీ20 మ్యాచ్‌కు ముందు.. ఇషాన్ కిష‌న్‌ను ఊరిస్తున్న భారీ మైలురాయి

శ‌నివారం వెస్టిండీస్‌తో జ‌ర‌గ‌నున్నఐదో టీ20 మ్యాచ్‌కు ముందు ఇషాన్ కిష‌న్‌ను (Ishan Kishan) ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

Team India Player Ishan Kishan need 11 more to complete 100 sixes in international t20 cricket

Ishan Kishan : బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా భార‌త్, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య శ‌నివారం ఐదో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. అత‌డు ఈ మ్యాచ్‌లో 11 సిక్స‌ర్లు కొడితే అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 సిక్స‌ర్ల మైలురాయిని చేరుకుంటాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో అత‌డు ఈ రికార్డు అందుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే. అయిన‌ప్ప‌టికి కూడా కివీస్‌తో సిరీస్ క‌న్నా ముందు సొంత గ‌డ్డ‌పై అత‌డు ఈ మైలురాయిని చేరుకోవాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

2021లో ఇషాన్ కిష‌న్ అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు 65 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 31.5 స‌గ‌టుతో 1924 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీ 13 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. 198 ఫోర్లు, 89 సిక్స‌ర్లు బాదాడు.

Bhuvneshwar Kumar : బిగ్ బ్రేకింగ్‌.. వెస్టిండీస్‌తో ఐదో టీ20 మ్యాచ్.. భువ‌నేశ్వ‌ర్‌ కుమార్‌ను జ‌ట్టులోకి తీసుకున్న బీసీసీఐ

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 6 గురు భార‌త ఆట‌గాళ్లు.. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, అభిషేక్ శ‌ర్మ‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, సంజూ శాంస‌న్‌లు మాత్ర‌మే 100 సిక్స‌ర్లు బాదారు.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 సిక్స‌ర్లు కొట్టిన భార‌త ప్లేయ‌ర్లు..

* రోహిత్ శ‌ర్మ – 159 మ్యాచ్‌ల్లో 205 సిక్స‌ర్లు
* సూర్య‌కుమార్ యాద‌వ్ – 113 మ్యాచ్‌ల్లో 179 సిక్స‌ర్లు
* అభిషేక్ శ‌ర్మ – 66 మ్యాచ్‌ల్లో 142 సిక్స‌ర్లు
* హార్దిక్ పాండ్యా – 138 మ్యాచ్‌ల్లో 126 సిక్స‌ర్లు
* విరాట్ కోహ్లీ – 125 మ్యాచ్‌ల్లో 124 సిక్స‌ర్లు
* సంజూ శాంస‌న్ – 76 మ్యాచ్‌ల్లో 102 సిక్స‌ర్లు

వెస్టిండీస్‌తో ఐదో టీ20 మ్యాచ్‌లో ఇషాన్ ఈ రికార్డు అందుకోక‌పోయిన‌ప్ప‌టికి కూడా అత‌డు కివీస్‌తో సిరీస్‌లో అందుకునే ఛాన్స్ ఉంది. అక్టోబ‌ర్ 22 నుంచి భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.