IND vs SL 3rd ODI: పద్మనాభస్వామి ఆలయంలో టీమిండియా ప్లేయర్లు.. బీచ్‌లో సతీమణితో కోహ్లి.. ఫొటోలు వైరల్

టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులను (ధోతీ) ధరించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Team india players in Padmanabhaswamy Temple

IND vs SL 3rd ODI: కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో నేడు శ్రీలంక జట్టుతో టీమిండియా మూడో వన్డే ఆడనుంది. ఈ సందర్భంగా శనివారమే తిరువనంతపురంకు టీమిండియా ఆటగాళ్లు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఒకటైన శ్రీపద్మనాభ స్వామి ఆలయాన్ని పలువురు టీమిండియా ఆటగాళ్లు సందర్శించారు.

Team india players in Padmanabhaswamy Temple

సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులను (ధోతీ) ధరించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

surya kumar yadav in Padmanabhaswamy Temple

ఆలయం ఎదుట ఆలయ అధికారులు, సిబ్బందితో ఫొటో దిగే సమయంలో టీమిండియా ఆటగాళ్లు సాంప్రదాయ దుస్తులు, తెల్లని ధోతీ, అంగవస్త్రం ధరించి కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Team india players in Padmanabhaswamy Temple

మూడో వన్డేకోసం కేరళ చేరుకున్న టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ తన సతీమణితో కలిసి త్రివేండ్రం బీచ్ లో అల్పాహారం స్వీకరిస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Virat Kohli  with Anushka Sharma in Trivandrum beech