Team India : టీమ్ఇండియా టీ20కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీకి భార‌త జ‌ట్టులో చోటు

టీమ్ఇండియా (Team India) టీ20 కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ ఎంపిక అయ్యాడు.

Team India Squad Announced for Ireland and England T20Is and Asian Games

Team India : టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ ఎంపిక అయ్యాడు. అంద‌రూ అనుకున్న‌ట్లుగానే కెప్టెన్‌గానే కాకుండా ఆట‌గాడిగా కూడా సూర్య‌కుమార్ యాద‌వ్ పై వేటు ప‌డింది. ఇక తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌కు వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. ఇంగ్లాండ్‌, ఐర్లాండ్ సిరీస్‌ల‌తో పాటు ఆసియా గేమ్స్‌కు టీ20 జ‌ట్ల‌ను బీసీసీఐ ప్ర‌క‌టించింది.

శ‌నివారం బీసీసీఐ ప్ర‌ధాన కార్యాల‌యంలో అజిత్ అగార్క‌ర్ అధ్య‌క్ష‌త‌న సెల‌క్ష‌న్ క‌మిటీ స‌మావేశమైంది. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ తొలిసారి టీమ్ఇండియాలో చోటు ద‌క్కించుకున్నాడు. మూడు సిరీస్‌ల్లోనూ అత‌డికి చోటు ద‌క్కింది.

Rishabh Pant : రిష‌బ్ పంత్ అరుదైన ఘ‌న‌త‌.. మూడో భార‌త వికెట్ కీప‌ర్‌గా..

ఈ మూడు సిరీస్‌కు ప్ర‌క‌టించిన జ‌ట్ల‌లో పెద్ద‌గా మార్పులు లేవు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్‌ల‌లో పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. అత‌డిని ఆసియా గేమ్స్‌కు ఎంపిక చేశారు. ఇంగ్లాండ్‌, ఐర్లాండ్ సిరీస్‌ల‌లో చోటు ద‌క్కించుకున్న సిరాజ్‌కు ఆసియా గేమ్స్ నుంచి విశ్రాంతి ఇచ్చారు.

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఇదే..

శ్రేయ‌స్ అయ్య‌ర్ (కెప్టెన్‌), తిల‌క్ వ‌ర్మ (వైస్ కెప్టెన్‌), సంజూ శాంస‌న్‌, అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌, శివ‌మ్ దూబె, నితీశ్‌కుమార్ రెడ్డి, అక్ష‌ర్ ప‌టేల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, వైభ‌వ్ సూర్య‌వంశీ, ర‌వి బిష్ణోయ్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, హ‌ర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌, ప్రిన్స్ యాద‌వ్

ఇంగ్లాండ్ సిరీస్ షెడ్యూల్‌..

  • తొలి టీ20 మ్యాచ్ – జూలై 1న‌
  •  రెండో టీ20 మ్యాచ్ – జూలై 4న‌
  •  మూడో టీ20 మ్యాచ్ – జూలై 7న‌
  •  నాలుగో టీ20 మ్యాచ్ – జూలై 9న‌
  •  ఐదో టీ20 మ్యాచ్ – జూలై 11న‌

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఇదే..

శ్రేయ‌స్ అయ్య‌ర్ (కెప్టెన్‌), తిల‌క్ వ‌ర్మ (వైస్ కెప్టెన్‌), సంజూ శాంస‌న్‌, అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌, శివ‌మ్ దూబె, నితీశ్‌కుమార్ రెడ్డి, అక్ష‌ర్ ప‌టేల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, వైభ‌వ్ సూర్య‌వంశీ, ర‌వి బిష్ణోయ్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, హ‌ర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌, ప్రిన్స్ యాద‌వ్‌.

ఐర్లాండ్ సిరీస్ షెడ్యూల్ ఇదే..

  • తొలి టీ20 మ్యాచ్ – జూన్ 26న‌
  • రెండో టీ20 మ్యాచ్ – జూన్ 28న‌

ఆసియా గేమ్స్‌కు భార‌త జ‌ట్టు ఇదే..

శ్రేయ‌స్ అయ్య‌ర్ (కెప్టెన్‌), తిల‌క్ వ‌ర్మ (వైస్ కెప్టెన్‌), సంజూ శాంస‌న్‌, అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌, శివ‌మ్ దూబె, నితీశ్‌కుమార్ రెడ్డి, అక్ష‌ర్ ప‌టేల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, వైభ‌వ్ సూర్య‌వంశీ, ర‌వి బిష్ణోయ్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, హ‌ర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌.

ఆసియా గేమ్స్ సెప్టెంబ‌ర్ 19 నుంచి అక్టోబ‌ర్ 4 వ‌ర‌కు జ‌రుగుతాయి.