WTC 2023- 25 : ప్రపంచ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లిన టీమిండియా

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టీమిండియా మళ్లీ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

Teamindia

Team Inida : ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టీమిండియా మళ్లీ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. మూడో స్థానంలో ఉన్న రోహిత్ సేన విజయాల శాతం 64.58తో టాప్ లోకి వెళ్లింది. న్యూజిలాండ్ (60.0శాతం), ఆస్ట్రేలియా (59.09శాతం) లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ 50శాతం విజయాలతో నాలుగో స్థానం దక్కించుకోగా.. పాకిస్థాన్ జట్టు 36.66 శాతంతో ఐదో స్థానంలో నిలిచింది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 172 పరుగుల తేడాతో ఓడిపోవటంతో టీమిండియాకు కలిసొచ్చింది.

Also Read : అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకలో దాండియా ఆడుతూ సందడి చేసిన ధోనీ, బ్రావో.. వీడియో వైరల్

ఎనిమిదేళ్ల తరువాత స్వదేశంలో న్యూజిలాండ్ ను ఆస్ట్రేలియా జట్టు ఓడించింది. ఇదిలాఉంటే.. టీమిండియా అగ్రస్థానంను కొనసాగించాలంటే మార్చి 7 నుంచి ధర్మశాలలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగే ఐదో టెస్టులో విజయం సాధించాల్సి ఉంటుంది. భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరిగే ఐదో టెస్టు డ్రాగా ముగిసినా.. ఇంగ్లాండ్ జట్టు టీమిండియాపై విజయం సాధించిందినా మళ్లీ డబ్ల్యూటీసీ 2023-25 పట్టికలో మొదటి స్థానాన్ని టీమిండియా కోల్పోయే ప్రమాదం పొంచిఉంది. ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ రెండో టెస్టు మార్చి 8 నుంచి ప్రారంభమవుతుంది. అగ్రస్థానంలో ఉన్న భారత్ ను అడిగమించడానికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కు అవకాశం దక్కుతుంది. అయితే, టీమిండియా ప్రస్తుతం అద్భుత ఫామ్ లో ఉంది. ఇంగ్లాండ్ తో ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో నాలుగు మ్యాచ్ లు పూర్తయ్యాయి. 3-1తో ఇండియా ఆధిక్యంలో కొనసాగుతుంది. 7నుంచి జరిగే మ్యాచ్ లోనూ టీమిండియా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.

Also Read : అంబానీ ఇంట్లో ప్రీవెడ్డింగ్ వేడుకలో జహీర్ ఖాన్‌ను ఆట‌ప‌ట్టించిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్

గత రెండు సార్లు టెస్టు ఛాంపియన్ షిప్ కు ఎంపికైన టీమిండియా టైటిల్ వేటలో ఓటమి పాలైంది. 2021లో న్యూజిలాండ్, 2023లో ఆస్ట్రేలియాలు భారత్ ను ఓడించి టెస్టు గదను దక్కించుకున్నాయి. ఈసారి ఎలాగైనా గదను కొల్లగొట్టాలని కసితో టీమిండియా ఉంది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు