Mohammad Rizwan : రిజ్వాన్‌కు ఘోర అవ‌మానం.. బ్యాటింగ్ చేస్తుండ‌గా.. రిటైర్డ్ ఔట్‌గా ర‌మ్మ‌ని పిలుపు.. చేసేది లేక‌..

బిగ్‌బాష్ లీగ్‌లో పాకిస్తాన్ స్టార్ ఆట‌గాడు మహమ్మద్ రిజ్వాన్‌కు (Mohammad Rizwan ) ఘోర అవ‌మానం జ‌రిగింది.

Mohammad Rizwan : రిజ్వాన్‌కు ఘోర అవ‌మానం.. బ్యాటింగ్ చేస్తుండ‌గా.. రిటైర్డ్ ఔట్‌గా ర‌మ్మ‌ని పిలుపు.. చేసేది లేక‌..

Mohmmad Rizwan was retired out by Melbourne Renegades during a BBL game

Updated On : January 14, 2026 / 11:46 AM IST
  • బిగ్‌బాష్ లీగ్‌లో రిజ్వాన్‌కు అవ‌మానం
  • మెల్‌బోర్న్ రెనిగేడ్స్ ప్రాతినిధ్యం
  • బ్యాటింగ్ చేస్తుండ‌గా మ‌ధ్య‌లో రిటైర్డ్ ఔట్

Mohammad Rizwan : బిగ్‌బాష్ లీగ్‌లో పాకిస్తాన్ స్టార్ ఆట‌గాడు మహమ్మద్ రిజ్వాన్‌కు ఘోర అవ‌మానం జ‌రిగింది. మెల్‌బోర్న్ రెనిగేడ్స్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న అత‌డిని ఇన్నింగ్స్ మధ్య‌లో రిటైర్డ్ ఔట్ చేశారు. దీన్ని చూసిన అత‌డి ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌కు గురి అయ్యారు. టీ20 మ్యాచ్‌లో అత‌డి జిడ్డు బ్యాటింగే అందుకు కార‌ణం.

అస‌లేం జ‌రిగిందంటే?

బిగ్‌బాష్ లీగ్ 2025-26లో భాగంగా సోమ‌వారం (జ‌న‌వ‌రి 12న‌) సిడ్నీ థండ‌ర్‌, మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. 18 ఓవ‌ర్ల‌కు 4 వికెట్ల న‌ష్టానికి 154 ప‌రుగులు చేసింది. రిజ్వాన్ (23 బంతుల్లో 26 ప‌రుగులు), హ‌స‌న్ (23 బంతుల్లో 36 ప‌రుగులు) క్రీజులో ఉన్నారు. అయితే.. చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో సాధ్య‌మైన‌న్ని ఎక్కువ ప‌రుగులు సాధించాల‌ని మెల్‌బోర్న్ భావించింది.

Virat Kohli : చ‌రిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో విరాట్ కోహ్లీ.. స‌చిన్‌, రోహిత్‌, ద్ర‌విడ్ రికార్డులు బ్రేక్ చేసేనా?

ఈ క్ర‌మంలో బంతికో ప‌రుగు చొప్పున చేస్తున్న రిజ్వాన్ ను రిటైర్డ్ ఔట్‌గా రావాల‌ని మెల్‌బోర్న్ కెప్టెన్ విల్ సదర్లాండ్ సూచించాడు. దీంతో చేసేది లేక రిజ్వాన్ రిటైర్డ్ ఔట్‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఈ క్ర‌మంలోనే బిగ్‌బాష్ లీగ్ చ‌రిత్ర‌లో రిటైర్డ్ ఔట్ అయిన తొలి బ్యాట‌ర్‌గా రిజ్వాన్ రికార్డుల‌కు ఎక్కాడు.

ఫ‌లించ‌ని వ్యూహాం..

అయితే.. ఈ వ్యూహాం పెద్ద‌గా వ‌ర్కౌట్ కాలేదు. రిజ్వాన్ స్థానంలో బ‌రిలోకి దిగిన కెప్టెన్ స‌ద‌ర్లాండ్ తొలి బంతికే ర‌నౌట్ అయ్యాడు. ఇక చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో మెల్‌బోర్న్ 16 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. చివ‌రికి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులు సాధించింది. మెల్‌బోర్న్ బ్యాట‌ర్ల‌లో పాక్ ఆల్ రౌండర్ హసన్ ఖాన్ (31 బంతుల్లో 46 ప‌రుగులు) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. సిడ్నీ బౌల‌ర్ల‌లో డేవిడ్ విల్లీ, ర్యాన్ హాడ్లీ, వెస్ అగర్ లు త‌లా రెండు వికెట్లు తీశారు.

Lauren Bell : డబ్ల్యూపీఎల్ కొత్తందం.. ఆర్‌సీబీ ప్లేయ‌ర్ లారెన్ బెల్ పిక్స్ చూస్తే మ‌తి పోవ‌డం ఖాయం..

అనంత‌రం 171 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో సిడ్నీ జ‌ట్టు బ‌రిలోకి దిగింది. అయితే.. వ‌ర్షం కార‌ణంగా డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో ఆ జ‌ట్టు ల‌క్ష్యాన్ని 16 ఓవ‌ర్ల‌లో 140 ప‌రుగులుగా నిర్దేశించారు. ఈ ల‌క్ష్యాన్ని సిడ్నీ 15.2 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సిడ్నీ బ్యాట‌ర్ల‌లో సామ్ బిల్లింగ్స్ (33), నిక్ మాడిన్సన్ (30 నాటౌట్), క్రిస్ గ్రీన్ (34 నాటౌట్ )లు రాణించారు. మెల్‌బోర్న్ బౌల‌ర్ల‌లో గురిందర్ సంధు నాలుగు వికెట్లు తీశాడు. ఆడ‌మ్ జంపా రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.