అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకలో దాండియా ఆడుతూ సందడి చేసిన ధోనీ, బ్రావో.. వీడియో వైరల్
అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అతని భార్య సాక్షి, మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావోలు

Dhoni, Sakshi, Bravo playing Dandiya
Dhoni, Bravo playing Dandiya : ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుక ఘనంగా జరుగుతుంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అతిరథ మహారథుల సమక్షంలో వరుసగా మూడు రోజుల పాటు ప్రీ-వెడ్డింగ్ వేడుకులను జరుపుకుంటోంది అంబానీ ఫ్యామిలీ. ఈ ప్రీ – వెడ్డింగ్ వేడుకల్లో ప్రపంచంలోని పలు దేశాల ప్రముఖులతోపాటు భారతదేశంలోని వ్యాపారవేత్తలు, సినీతారలు, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చి సందడి చేశారు.
Also Read : Anant Ambani Pre Wedding : నేను అతనిలో నా తండ్రిని చూస్తున్నాను.. ముఖేశ్ అంబానీ ఎమోషనల్ స్పీచ్
అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అతని భార్య సాక్షి, మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావోలు దాండియా ఆడుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ధోనీతో పాటు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, జహీర్ ఖాన్, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, కీరన్ పోలార్డ్, బౌల్డ్, రషీద్ ఖాన్, పలువురు ప్రముఖ క్రికెటర్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. వీరంతా కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలో సందడి చేశారు.
https://twitter.com/CricketopiaCom/status/1764117322661261562?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1764117322661261562%7Ctwgr%5Ef2a6460781fca5bafb135283bc06939649ddab7c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fcrictoday.com%2Fcricket%2Fnews%2Fwatch-ms-dhoni-sakshi-and-dwayne-bravo-play-dandiya%2F
https://twitter.com/TheDhoniEra/status/1764115297240277033?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1764115297240277033%7Ctwgr%5Ef2a6460781fca5bafb135283bc06939649ddab7c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fcrictoday.com%2Fcricket%2Fnews%2Fwatch-ms-dhoni-sakshi-and-dwayne-bravo-play-dandiya%2F