Team India T20 World Cup 2026 Squad Announced
T20 World Cup 2026 : వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ 2026 ప్రపంచకప్ జరగనుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మెగాటోర్నీలో (T20 World Cup 2026) పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యుల గల బృందాన్ని సెలక్టర్లు ఎంపిక చేశారు.
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే భారత జట్టు ఈ మెగాటోర్నీలో బరిలోకి దిగనుంది. అతడికి డిప్యూటీగా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్న శుభ్‌మన్ గిల్ పై వేటు పడింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పరుగుల వరద పారించడంతో పాటు ఫైనల్ మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన ఇషాన్ కిషన్‌ను సెలక్టర్లు కరుణించారు. దాదాపు రెండేళ్ల తరువాత అతడు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.
🚨India’s squad for ICC Men’s T20 World Cup 2026 announced 🚨
Let’s cheer for the defending champions 💪#TeamIndia | #MenInBlue | #T20WorldCup pic.twitter.com/7CpjGh60vk
— BCCI (@BCCI) December 20, 2025
శుభ్‌మన్ గిల్ లేకపోవడంతో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లుగా తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్‌లు చోటు దక్కించుకున్నారు. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో పేస్ ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబెలు ఎంపిక కాగా.. స్పిన్ ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లు చోటు దక్కించుకున్నారు. ఫినిషర్‌గా రింకూ సింగ్‌కు ఎంపిక అయ్యాడు.
IND vs SA : సూర్యకుమార్ యాదవ్ కామెంట్స్.. సిరీస్ గెలిచాం కానీ.. అదొక్కటే ..
పేసర్ల విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ ఎంపిక కాగా.. స్పెషలిస్టు స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు చోటు దక్కింది. సంజూ శాంసన్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ ను ఎంపిక చేశారు.
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).
కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఇదే జట్టు..
ఇక ఇదే జట్టు జనవరి 21 స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ ఆడనుందని బీసీసీఐ తెలిపింది. మెగాటోర్నీకి ముందు భారత జట్టు ఆడే చివరి టీ20 సిరీస్ ఇదే.
భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్..
* తొలి టీ20 మ్యాచ్ – జనవరి 21న (నాగ్‌పూర్)
* రెండో టీ20 మ్యాచ్ – జనవరి 23న (రాయ్‌పూర్)
* మూడో టీ20 మ్యాచ్ – జనవరి 25న (గౌహతి)
* నాలుగో టీ20 మ్యాచ్ – జనవరి 28న (విశాఖ)
* ఐదో టీ20 మ్యాచ్ – జనవరి 31న (తిరువనంతపురం )