IND vs NZ : ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్‌పై భార‌త్ విజ‌యం.. 3-1తో సిరీస్ కైవ‌సం

IND vs NZ : మౌంట్ మౌంగనుయి వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఐదో వ‌న్డే మ్యాచ్‌లో భార‌త్ 22 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

IND vs NZ Team India won by 22 runs against New Zealand in 5th ODI

IND vs NZ : మౌంట్ మౌంగనుయి వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఐదో వ‌న్డే మ్యాచ్‌లో భార‌త్ 22 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌ను భార‌త్ 3-1 తేడాతో కైవ‌సం చేసుకుంది. మూడో వ‌న్డే మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైన సంగ‌తి తెలిసిందే.

210 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ 48.1 ఓవ‌ర్ల‌లో 187 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. కివీస్ బ్యాట‌ర్ల‌లో డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (31; 42 బంతుల్లో 5 ఫోర్లు), నిక్ కెల్లీ (24; 45 బంతుల్లో 2 ఫోర్లు), మిచెల్ సాంట్న‌ర్ (24; 31 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స‌ర్లు) ప‌ర్వాలేద‌నిపించారు. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. సిరాజ్, అక్ష‌ర్ ప‌టేల్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అకిబ్ న‌బీ, య‌శ్ ఠాకూర్‌, న‌మ‌ర్ ధీర్‌లు త‌లా ఓ వికెట్ సాధించారు.

IND vs PAK U19 : అదరగొట్టిన సుభాష్..! పాక్‌పై అద్భుత విజయంలో తెలుగు కుర్రాడి కీలక పాత్ర.. బంతితో.. బ్యాటుతో.. ప్రధాని మోదీ ప్రశంస

అంతక‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ 42.1 ఓవ‌ర్ల‌లో 209 ప‌రుగుల‌కు ఆలౌటైంది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్ (46; 55 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), ఇషాన్ కిష‌న్ (46; 58 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)లు రాణించారు.

శ్రేయ‌స్ అయ్య‌ర్ (22), న‌మ‌న్ ధీర్ (22) లు ప‌ర్వాలేద‌నిపించ‌గా.. రోహిత్ శ‌ర్మ (7), విరాట్ కోహ్లీ (5), రుతురాజ్ గైక్వాడ్ (18)లు విఫ‌లం అయ్యారు. కివీస్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ మిచెల్ సాంట్న‌ర్, జాకబ్ డఫీ చెరో మూడు వికెట్లు తీయ‌గా.. మాథ్యూ ఫిషర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. బ్లెయిర్ టిక్నర్, మైఖేల్ బ్రేస్‌వెల్ చెరో ఓ వికెట్ సాధించారు.