PVL: బ్లాక్‌హాక్స్‌కు నిరాశ.. చెన్నై బ్లిట్జ్‌ చేతిలో పరాజయం

చెన్నై బ్లిట్జ్‌ మిడిల్‌ బ్లాక్‌ ప్లేయర్లు నిలకడగా ఆడగా, హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ ఫుంజుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

PVL

రూపే ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో చెన్నై బ్లిట్జ్‌ తొలి విజయం నమోదు చేసింది. చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ పరాజయం పాలైంది. వరుస సెట్లలో 16-14, 15-11 15-7తో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌పై చెన్నై బ్లిట్జ్‌ గెలుపొందింది. సమీర్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో పరాజయం పాలైన చెన్నై బ్లిట్జ్‌.. రెండో మ్యాచ్‌కు వ్యూహాత్మక మార్పులు చేసింది. మ్యాచ్‌ ఆరంభం నుంచీ మిడిల్‌ బ్లాకర్స్‌ ముందుండి నడిపించారు. అఖిన్‌ జిఎస్‌, లియాండ్రో జోస్‌లు హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ పాయింట్లను బ్లాక్‌ చేశారు. సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ కాస్త ఒత్తిడిలో కనిపించింది. అనవసర తప్పిదాలతో బ్లాక్‌హాక్స్‌ 0-3తో పరాజయం చవిచూసింది.

PVL

కెప్టెన్‌ రంజిత్‌ సింగ్‌ పాస్‌లతో ఆకట్టుకోగా హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ పుంజుకునే ప్రయత్నం చేసింది. ఈ సీజన్‌లో చెన్నై బ్లిట్జ్‌ జట్టులోకి వచ్చిన సమీర్‌ సమరోత్సాహం చూపించాడు. పవర్‌ఫుల్‌ స్మాష్‌లతో చెలరేగిన సమీర్‌.. చెన్నై బ్లిట్జ్‌ను ముందంజలో నిలిపాడు. స్టెఫాన్‌ కోవాసెక్‌ను ఆటలో మరింత మమేకం చేసేందుకు ప్రయత్నించగా.. చెన్నై ఎదురుదాడి ఆట తీరు బ్లాక్‌హాక్స్‌ను సర్వీస్‌లైన్‌ వద్ద తికమక పెట్టింది.

చెన్నై బ్లిట్జ్‌ మిడిల్‌ బ్లాక్‌ ప్లేయర్లు నిలకడగా ఆడగా నిలుపుకోగా హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ ఫుంజుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అగ్రెసివ్‌ సర్వీస్‌తో డోగ్లాస్‌ బ్యూనె బ్లాక్‌హాక్స్‌ను మరింత ఇరకాటంలో పడేశాడు. పాయింట్ల అంతరం కుదించేందుకు బ్లాక్‌హాక్స్‌ సూపర్‌ పాయింట్‌కు వెళ్లినా.. అది మిస్‌ఫైర్‌ కావటంతో వరుస సెట్లలోనే మ్యాచ్‌ను కోల్పోయింది.

IND vs ENG 3rd Test : రాజ్‌కోట్‌లో టీమ్ఇండియా రాజ‌సం.. ఇంగ్లాండ్‌పై భారీ విజ‌యం