Wrestlers Protest: రెజ్లర్లు ఆందోళన విరమించుకోవడంపై బ్రిజ్ భూషణ్ ఏమన్నారంటే?

తమను లైంగిక వేధింపులకు గురిచేసిన బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయనిదే తాము ఉద్యమాన్ని విరమించబోమని మొదట స్పష్టం చేసిన రెజ్లర్లు ఆ డిమాండ్ నెరవేరకుండానే తమ ఉద్యమాన్ని విరమించారు.

Wrestlers and Brijbhushan Sharan Singh

Wrestlers Protest – Brij Bhushan: రెజ్లర్లు తమ ఆందోళనను విరమించుకున్న వేళ దీనిపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. కోర్టు తన పని తాను చేస్తుందని చెప్పుకొచ్చారు.

” నేను దీనిపై మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఇది కోర్టు పరిధిలో ఉంది. న్యాయస్థానం తన పని తాను చేస్తుంది ” అని బ్రిజ్ భూషణ్ అన్నారు. కొన్ని రోజుల క్రితం కూడా ఈ విషయంపై మీడియా ముందు మాట్లాడడానికి ఆయన అంగీకరించలేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అప్పట్లోనూ అన్నారు.

ఇక రెజ్లర్ల ఉద్యమం నీరుగారిపోయినట్లేనని ప్రచారం జరుగుతోంది. తమను లైంగిక వేధింపులకు గురిచేసిన బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయనిదే తాము ఉద్యమాన్ని విరమించబోమని మొదట స్పష్టం చేసిన రెజ్లర్లు ఆ డిమాండ్ నెరవేరకుండానే తమ ఉద్యమాన్ని విరమించారు. ఇక కోర్టులోనే తేల్చుకుంటామని చెబుతున్నారు. దీంతో కొన్ని నెలల్లో జరిగే ఏసియన్ గేమ్స్ లో వారు పాల్గొనే అవకాశం ఉంది. కొందరు రెజ్లర్లు ఇప్పటికే రైల్వే ఉద్యోగాల్లోనూ చేరారు.

Wrestlers Protest : న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగుతుంది.. వీధుల్లో కాదు కోర్టు ద్వారా!.. సోషల్ మీడియాకు దూరం

Wrestlers Protest: ఒకరినొకరు తిట్టుకున్న రెజ్లర్లు సాక్షి మాలిక్‌ – బబితా ఫొగట్