Hardik Pandya : హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు.. లక్ష్యం అదే.. ఇక పై..
ముంబై ఇండియన్స్ ఆరోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడమే తన లక్ష్యం అని కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తెలిపాడు.
- Thota Vamshi Kumar
- Published On : March 23, 2026 / 11:50 AM IST
The Ultimate dream is MI Win 6th IPL title says Hardik Pandya
Hardik Pandya : ముంబై ఇండియన్స్ ఆరోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడమే తన లక్ష్యం అని కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్ ఆరంభానికి ముందు పాండ్యా మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పాడు.
రెండేళ్ల విరామం తరువాత హార్దిక్ పాండ్యా 2024లో ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చాడు. ఐపీఎల్ 2024, 2025 సీజన్లలో ముంబై జట్టుకు నాయకత్వం వహించినప్పటికి ఆశించిన పలితాలను సాధించడంలో విఫలం అయ్యాడు. అయితే.. ఈ సీజన్‌లో ముంబైని విజేతగా నిలిపి.. జట్టులో విజయ సంస్కృతిని తిరిగి తీసుకురావాలని, అద్భుమైన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నట్లుగా హార్దిక్ తెలిపాడు.
‘ముంబై ఇండియన్స్ ఆరోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలవడమే నా లక్ష్యం. ముంబై ఇండియన్స్‌కు ఇప్పటికే అద్భుతమైన వారసత్వం ఉంది. నేను జట్టులోకి కుర్రాడిగా వచ్చిన కొత్తలో లభించిన మద్దతు అద్భుతం. అండగా నిలిచారు. నా ఎదుగుదలకు ఎంతగానో సాయపడ్డారు. జట్టులోని ప్లేయర్లు అత్యుత్తమ క్రికెట్ ఆడేందుకు శ్రమిస్తారు. ఈ సంస్కృతిని ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నా.’ అని హార్దిక్ పాండ్యా అన్నాడు.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 29న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడనుంది. ఆ తరువాత ఏప్రిల్ 4న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్‌తో, ఏప్రిల్ 12న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
ఐపీఎల్ 2026 కోసం ముంబై ఇండియన్స్ జట్టు ఇదే..
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డికాక్, విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మయాంక్ మార్కండే, నమన్, ఘ్రాం, రోబిన్, నమన్, నమన్, ఘ్రా, రాజ్ అంగద్ బావా, అశ్వనీ కుమార్, రఘు శర్మ, డానిష్ మలేవార్, మహ్మద్ ఇజార్, అథర్వ అంకోలేకర్, మయాంక్ రావత్.
