Theekshana : ఇది అన్యాయం.. మా విషయంలో ఇలా చేయడం తగదు..!
శ్రీలంక స్టార్ స్పిన్నర్ మహేశ్ తీక్షణ టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
- Thota Vamshi Kumar
- Published On : June 4, 2024 / 05:30 PM IST
Theekshana hits out at Sri Lankas gruelling WC schedule
శ్రీలంక స్టార్ స్పిన్నర్ మహేశ్ తీక్షణ టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పొట్టి ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు గ్రూపు స్టేజీలో నాలుగు మ్యాచులను నాలుగు భిన్నమైన వేదికల్లో ఆడడంపై అతడు అసహనం వ్యక్తం చేశాడు. కొన్ని జట్ల అన్ని మ్యాచులను ఒకే వేదికగా నిర్వహిస్తున్నారని, తమ విషయంలో మాత్రం ఇలా వ్యవహరించడం చాలా అన్యాయం అని చెప్పాడు.
తమ జట్టు బస చేయడానికి ఇచ్చిన హోటల్ నుంచి గ్రౌండ్‌కు వెళ్లేందుకు దాదాపు గంటా 40 నిమిషాల సమయం పడుతుందని చెప్పాడు. అయితే.. కొన్ని జట్లకు మాత్రం 15 నిమిషాల్లోనే స్టేడియంకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారన్నాడు. ఇది తీవ్రమైన అన్యాయమన్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కోసం న్యూయార్క్‌కు వచ్చే సమయంలో ఎయిర్‌పోర్టులో తమ జట్టు ఆటగాళ్లు ఎనిమిది గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందన్నాడు.
AFG vs UGA : ఘనంగా బోణీ కొట్టిన అఫ్గానిస్తాన్.. రికార్డులే రికార్డులు
దక్షిణాప్రికాతో మ్యాచ్ అనంతరం తీక్షణ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం వేదికలను మార్చలేరని, అయితే భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించాడు. గ్రూప్-డిలో దక్షిణాఫ్రికా, శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ ఉన్నాయి.
కాగా.. ఈ సారి ప్రపంచకప్‌లో 20 జట్లు పోటీ చేస్తున్నాయి. వీటిని అయిదు దేశాల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూపు స్టేజ్‌లో ఒక జట్టు మిగిలిన గ్రూపుల్లో నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంది. కాగా.. శ్రీలంక, నెదర్లాండ్స్ మాత్రమే నాలుగు మ్యాచులను నాలుగు భిన్నమైన వేదికలపై ఆడాల్సి ఉంది. భారత్, దక్షిణాఫ్రికాలు ఒకే వేదికగా మూడు మ్యాచులు ఆడనున్నాయి. ఒక మ్యాచ్ మాత్రమే వేరే వేదికపై ఆడనున్నాయి.
Rahul Dravid : టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లి.. హెడ్ కోచ్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు..
