AFG vs UGA : ఘనంగా బోణీ కొట్టిన అఫ్గానిస్తాన్.. రికార్డులే రికార్డులు
టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్ ఘనంగా బోణీ కొట్టింది.

pic credit : ICC
Afghanistan vs Uganda : టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్ ఘనంగా బోణీ కొట్టింది. మంగళవారం గయానా వేదికగా ఉగాండతో జరిగిన మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో రెండు పాయింట్లు సాధించిన అఫ్గానిస్తాన్ గ్రూపు సిలో టాపర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ పలు రికార్డులను నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. రహ్మనుల్లా గుర్బాజ్ (45 బంతుల్లో 76), ఇబ్రహీం జద్రాన్ (46 బంతుల్లో 70) హాఫ్ సెంచరీలు బాదారు. ఉగాండ బౌలర్లలో కాస్మస్, బ్రియాన్ మసాబా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఫజల్లా ఫరూకీ ఐదు వికెట్లతో చెలరేగడంతో లక్ష్య ఛేదనలో ఉగాండ 16 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది.
Hanuma Vihari : ఏపీలో కూటమి హవా.. హనుమ విహారి ట్వీట్ వైరల్..!
పలు రికార్డులు..
– టీ20 ప్రపంచకప్‌లో పరుగుల పరంగా అఫ్గానిస్తాన్‌కు ఇది రెండో అతి పెద్ద విజయం. 2021లో స్కాట్‌లాండ్ పై 130 పరుగులతో గెలిచింది.
– టీ 20 ప్రపంచకప్‌లో ఓవరాల్‌గా పరుగుల పరంగా ఇది నాలుగో విజయం. తొలి మూడు స్థానాల్లో శ్రీలంక(కెనడా పై 172 పరుగులు), అఫ్గానిస్తాన్ (స్కాట్‌లాండ్ పై 130 పరుగులు), దక్షిణాఫ్రికా (స్కాట్‌లాండ్‌పై 130పరుగులు) లో ఉన్నాయి.
– అఫ్గానిస్తాన్ ఓపెనర్లు గుర్బాజ్-జద్రాన్ తొలి వికెట్‌కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ చరిత్రలో మొదటి వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన రెండో జంటగా రికార్డులకు ఎక్కింది. ఓవరాల్‌గా నాలుగో స్థానంలో ఉంది.
Rahul Dravid : టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లి.. హెడ్ కోచ్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు..