Hanuma Vihari : ఏపీలో కూటమి హవా.. హనుమ విహారి ట్వీట్ వైరల్..!
తెలుగు క్రికెటర్ హనుమ విహారి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Hanuma Vihari Tweet On Ap Elections Results 2024
Hanuma Vihari Tweet : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి హవా కొనసాగుతోంది. కూటమి అధికారం కైవసం చేసుకునే దిశగా దూసుకువెలుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో టీడీపీకి, జనసేన, బీజేపీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఏపీకి మంచి రోజులు వచ్చాయని ఇప్పటికే మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ట్వీట్ చేయగా మరో తెలుగు క్రికెటర్ హనుమ విహారి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
హనుమ విహారి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కేవలం నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు.
?
— Hanuma vihari (@Hanumavihari) June 4, 2024
Ambati Rayudu : ఎన్నికల ఫలితాలపై అంబటి రాయుడు ట్వీట్.. ఏపీకి మంచి రోజులు వచ్చాయ్..
ఆ గొడవ కారణంగానేనా?
రంజీట్రోఫ్రీ 2023-24లో మధ్యప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్రా జట్టు నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఆంధ్రా ప్రయాణం ముగిసిన అనంతరం విహారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక పై తాను ఆంధ్రా జట్టుకు ఎప్పుడూ ఆడనని చెప్పాడు. అదే సమయంలో ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందోనన్న విషయాలను తెలియజేశాడు. ఓ రాజకీయ నాయకుడి కుమారుడిపై అరిచినందుకు తన కెప్టెన్సీ కోల్పోవాల్సి వచ్చిందన్నాడు.
Rahul Dravid : టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లి.. హెడ్ కోచ్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు..
‘బెంగాల్‌తో జరిగిన మొదటి గేమ్‌లో నేను కెప్టెన్‌గా ఉన్నాను. ఆ గేమ్‌లో నేను 17వ ఆటగాడిపై అరిచాను. అతడు తన తండ్రికి ఫిర్యాదు చేశాడు. అతని తండ్రి ప్రతిగా నాపై చర్య తీసుకోవాలని అసోసియేషన్‌ను కోరారు. ఆటపై ఉన్న ప్రేమ, జట్టును గౌరవించడంతోనే కెప్టెన్‌గా తొలగించినప్పటికీ సీజన్‌లో కొనసాగినట్లు వివరించాడు. ‘విచారకరమైన భాగం ఏమిటంటే ఆటగాళ్ళు తాము ఏది చెప్పినా వినాలని అసోసియేషన్ భావిస్తుంది. కానీ నేను ఈ రోజు వరకు దానిని బయటపెట్టలేదు. నా ఆత్మగౌరవాన్ని కోల్పోయాను. అందుకనే ఆంధ్రా తరఫున ఎప్పటికీ ఆడకూడదని నిర్ణయించుకున్నాను. నేను జట్టును ఎప్పటికీ ప్రేమిస్తాను.’అని విహారి అన్నాడు.
కాగా.. సదరు పార్టీ నాయకుడు వైసీపీలో ఉన్నాడనే ప్రచారం జరిగింది. ఇది వైరల్‌గా మారడంతో అప్పట్లో టీడీపీ నాయకులు, జనసేన కార్యకర్తలు విహారికి మద్దుతు తెలుపుతూ మాట్లాడారు. ఈ క్రమంలో నేడు కూటమి అధికారం కైవసం చేసుకునే దిశగా దూసుకువెలుతుండడంతో తన ఆనందాన్ని విహారి ఇలా వ్యక్తం చేశాడని నెటిజన్లు అంటున్నారు.