IPL2026 playoffs schedule : ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే.. ఎవ‌రితో ఎవ‌రు ఎప్పుడు త‌ల‌ప‌డ‌నున్నారంటే?

ఐపీఎల్ 2026లో లీగ్ ద‌శ ముగిసింది. ప్లేఆఫ్స్‌కు (IPL2026 playoffs schedule) నాలుగు జ‌ట్లు చేరుకున్నాయి

These 4 teams reached IPL2026 playoffs and schedule details here (pic credit@ipl)

  • ఐపీఎల్ 2026లో ముగిసిన లీగ్ ద‌శ‌
  • ప్లేఆఫ్స్‌కు చేరుకున్న నాలుగు జ‌ట్లు
  • మే 26 నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు

IPL2026 playoffs schedule : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో లీగ్ ద‌శ ముగిసింది. ఆఖ‌రి రోజు వ‌ర‌కు మ్యాచ్‌లు ఆస‌క్తిక‌రంగా సాగాయి. లీగ్ ద‌శ‌లో చివ‌రి రోజున ప్లేఆఫ్స్‌కు వెళ్లే నాలుగో జ‌ట్టు ఏదో తెలిసిపోయింది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజ‌రాత్ టైటాన్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌లు పాయింట్ల ప‌ట్టిక‌లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి.

ప్లేఆఫ్స్‌లో ఎవ‌రితో ఎవ‌రు?

క్వాలిఫ‌య‌ర్‌-1
పాయింట్ల ప‌ట్టిక‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఆర్‌సీబీ, గుజ‌రాత్ జ‌ట్లు రేపు (మే26 మంగ‌ళ‌వారం) క్వాలిఫ‌య‌ర్‌-1లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌కు ధ‌ర్మ‌శాల ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌లో అడుగుపెడుతుంది. ఓడిపోయిన జ‌ట్టుకు ఫైన‌ల్ చేరుకునేందుకు మ‌రో అవ‌కాశం ఉంటుంది. ఓడిపోయిన జ‌ట్టు క్వాలిఫ‌య‌ర్‌-2లో ఆడ‌నుంది.

Rishabh Pant : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌.. చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మైన ల‌క్నో.. రిష‌బ్ పంత్ కెప్టెన్సీ పై వేటు ? టామ్ మూడీ కీల‌క వ్యాఖ్య‌లు..

ఎలిమినేట‌ర్‌
పాయింట్ల ప‌ట్టిక‌లో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్లు బుధ‌వారం (మే 27) ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌కు ముల్ల‌న్ పూర్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన జ‌ట్టు ఇంటి ముఖం ప‌డుతుంది. గెలిచిన జ‌ట్టు క్వాలిఫ‌య‌ర్‌-2కు అర్హ‌త సాధిస్తుంది.

క్వాలిఫ‌య‌ర్‌-2
క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్ శుక్ర‌వారం (మే 29) జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో క్వాలిఫ‌య‌ర్‌-1లో ఓడిపోయిన జ‌ట్టు ఎలిమినేట‌ర్‌లో విజ‌యం సాధించిన జట్టు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకుంటుంది.

Arjun Tendulkar : ల‌క్నో త‌రుపున అర్జున్ టెండూల్క‌ర్ అరంగ్రేటం.. తండ్రి సచిన్ అలా.. అక్క సారా ఇలా..

ఫైన‌ల్‌
ఆదివారం (మే 31) ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో క్వాలిఫ‌య‌ర్ -1లో విజ‌యం సాధించిన జ‌ట్టు క్వాలిఫ‌య‌ర్ 2లో గెలుపొందిన జ‌ట్టు క‌ప్పు కోసం పోటీప‌డ‌తాయి. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం ఫైన‌ల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది.