Rishabh Pant : ఐపీఎల్ 2026 సీజన్లో పేలవ ప్రదర్శన.. చర్యలకు సిద్ధమైన లక్నో.. రిషబ్ పంత్ కెప్టెన్సీ పై వేటు ? టామ్ మూడీ కీలక వ్యాఖ్యలు..
ఐపీఎల్ 2026 సీజన్లో రిషబ్ పంత్ (Rishabh Pant) సారథ్యంలో 14 లీగ్ మ్యాచ్‌లు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ కేవలం నాలుగు అంటే నాలుగే మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
IPL 2026 Will Pant be sacked as LSG captain Tom Moody Key comments (pic credit@ipl)
- అట్టడుగు స్థానంతో ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు
- రిషబ్ పంత్ పై చర్యలు తీసుకోనున్న లక్నో
- టామ్ మూడీ కీలక వ్యాఖ్యలు
Rishabh Pant : ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన చేసింది. రిషబ్ పంత్ సారథ్యంలో 14 లీగ్ మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం నాలుగు అంటే నాలుగే మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో 10 మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడిపోయింది. 8 పాయింట్లతో అట్టడుగు స్థానంతో సీజన్‌ను ముగించింది.
ఇదిలా ఉంటే.. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ రిషబ్ పంత్ తీవ్రంగా నిరాశపరిచాడు. 14 మ్యాచ్‌ల్లో 28.36 సగటు, 138.05 స్ట్రైక్‌రేటుతో 312 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను వేలంలో 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. లీగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు.
MI vs RR : ముంబైలో వర్షం.. రాజస్థాన్‌కు మొదలైన టెన్షన్.. మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటి? ఏ జట్టు ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుందంటే?
కేఎల్ రాహుల్ తరువాత సారథ్య బాధ్యతలను అందుకున్న పంతో రెండు సీజన్లలోనూ కెప్టెన్ గా ఘోరం విఫలం అయ్యాడు. ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో జట్టు ఏడో స్థానంతో ముగించగా ఈ సారి దారుణంగా అట్టడుగు స్థానంతో నిలిచింది. ఈ క్రమంలో అతడిపై వేటు తప్పదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
దీనిపైనే లక్నో సూపర్ జెయింట్స్ డైరెక్టర్ క్రికెట్ టామ్ మూడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎవరిని నేరుగా నిందించకపోయినప్పటికి ఫ్రాంచైజీ మొత్తం నిర్మాణాన్ని పునఃసమీక్షిస్తున్నట్లుగా చెప్పారు.
కెప్టెన్సీ పరంగా చూస్తే.. పంత్ దీన్ని సవాలుగా భావించాడని ఫలితాలు కూడా అదే ప్రతిబింబిస్తున్నాయని తెలిపాడు. నాయకత్వ ఒత్తిడి పంత్ బ్యాటింగ్ శైలిపై ప్రభావం చూపుతోందా అనే విషయం ఆలోచించాల్సి ఉందన్నాడు. ఈ సీజన్ మాకు చాలా కష్టంగా గడిచిందని నాకు తెలుసు. కానీ మేము దీనిపై పునరాలోచిస్తాము, సమయం తీసుకుంటాము. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటాము. అని మూడీ విలేకరుల సమావేశంలో తెలిపాడు.
Arjun Tendulkar : లక్నో తరుపున అర్జున్ టెండూల్కర్ అరంగ్రేటం.. తండ్రి సచిన్ అలా.. అక్క సారా ఇలా..
మూవీ మాటలను బట్టి చూస్తుంటే.. పంత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో అతడిని ఆటగాడిగా కొనసాగిస్తుందా? లేదా అన్నది ప్రస్తుతానికి పెద్ద ప్రశ్నగానే ఉంది. రాబోయే కొద్ది నెలల్లో దీనిపై స్పష్టత రావొచ్చు.
