MI vs RR : ముంబైలో వర్షం.. రాజస్థాన్‌కు మొదలైన టెన్షన్.. మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటి? ఏ జట్టు ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుందంటే?
వాంఖడే వేదికగా నేడు ముంబై ఇండియన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ ( MI vs RR) తలపడనుంది.
Will Team will enter into playoff if MI vs RR match aborted due to rain
- వాంఖడే వేదికగా నేడు ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్
- ఈ మ్యాచ్‌పైనే పంజాబ్ ఆశలు
- గెలిస్తే రాజస్థాన్ నేరుగా ప్లేఆఫ్స్‌లోకి
- ఈ ఉదయం ముంబైలో వర్షం
- వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే ఎవరికి లాభం అంటే?
MI vs RR : ఐపీఎల్ 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే మూడు జట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. మిగిలిన ఒక్క స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ల మధ్య పోటీ ఉంది. అయితే.. నేడు (మే 24న) వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధిస్తే.. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.
ఒకవేళ ఓడిపోతే మాత్రం అప్పుడు ప్లేఆఫ్స్‌కు చేరకుండానే నిష్ర్కమిస్తుంది. అదే సమయంలో పంజాబ్‌కు, కోల్‌కతాకు దారులు ఓపెన్ అవుతాయి. ఢిల్లీతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ నేడు మ్యాచ్ ఆడనుంది. ఈమ్యాచ్‌లో కేకేఆర్ ఓడిపోతే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమిస్తుంది. ఒకవేళ కేకేఆర్ విజయం సాధిస్తే అప్పుడు పంజాబ్, కేకేఆర్ 15 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు మెరుగైన నెట్‌రన్‌రేటు కలిగిన జట్టు ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.
Arjun Tendulkar : లక్నో తరుపున అర్జున్ టెండూల్కర్ అరంగ్రేటం.. తండ్రి సచిన్ అలా.. అక్క సారా ఇలా..
ముంబైలో వర్షం!
ఇదిలా ఉంటే.. ఈ ఉదయం ముంబై వర్షం కురిసింది. దీంతో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ సజావుగా సాగుతుందా? ఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దు అయితే.. ఎవరు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటారు అన్న ఆసక్తి అందరిలో ఉంది.
VIDEO | Maharashtra: Rain lashes several parts of Mumbai, bringing respite from the scorching heat. Visuals from Thane.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/FgTAcc3uGh
— Press Trust of India (@PTI_News) May 24, 2026
ఆక్యూ వెదర్ ప్రకారం.. ముంబైలో మధ్యాహ్నం కొద్దిపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రానికి ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలకు చేరుకుంటుంది.
వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే..
వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే.. అప్పుడు ఇరు జట్లకు (ముంబై, రాజస్థాన్)లకు చెరో పాయింట్‌ను కేటాయిస్తారు. అప్పుడు రాజస్థాన్ ఇంటి ముఖం పడుతుంది. 15 పాయింట్లతో పంజాబ్‌తో సమానంగా నిలిచినప్పటికి కూడా నెట్‌రన్‌రేటు తక్కువగా ఉండడమే అందుకు కారణం. పంజాబ్ నెట్‌రన్‌రేటు +0.309గా ఉండగా.. రాజస్థాన్ నెట్‌రన్‌రేటు +0.083గా ఉంది.
వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే.. రేసులో నుంచి రాజస్థాన్ ఔట్ అవ్వగా కేకేఆర్, పంజాబ్‌లు ఉంటాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి జరిగే మ్యాచ్ పై ఆధారపడి ఉంటుంది. అందులో కేకేఆర్ గెలిస్తే నెట్‌రన్‌రేటు ఆధారంగా కోల్‌కతా, పంజాబ్‌లలో ఓ జట్టు ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. అదే కేకేఆర్ ఓడిపోతే పంజాబ్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతోంది.
