IPL Trophy : రెండు లేదా అంత‌కంటే ఎక్కువ ఫైన‌ల్స్ ఆడిన‌ప్ప‌టికి ఐపీఎల్ ట్రోఫీని గెల‌వ‌ని వారు వీరే.. లిస్ట్ చాలా పెద్ద‌దే.. హేమాహేమీలు కూడా..

రెండు లేదా అంత‌కంటే ఎక్కువ ఫైన‌ల్స్ (IPL Trophy) ఆడిన‌ప్ప‌టికి కూడా ఐపీఎల్ గెలిచిన జ‌ట్టులో భాగం కాని స‌భ్యులు ఎవ‌రో చూద్దాం.

These players are never win IPL title after played 2 finals

IPL Trophy : అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వ‌రుస‌గా రెండో సారి క‌ప్పును ముద్దాడింది. ఈ విజయంతో కృనాల్ పాండ్యా , జోష్ హేజిల్‌వుడ్ వంటి ఆటగాళ్లు ఫైనల్స్‌లో తమ అజేయ రికార్డులను నిలబెట్టుకున్నారు.

తాజా మ్యాచ్‌తో క‌లిపి కృనాల్ పాండ్యా ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు ఐపీఎల్ ఫైన‌ల్స్ ఆడ‌గా.. ఎప్పుడూ ఓడిపోలేదు. ఇక హేజిల్‌వుడ్ విష‌యానికి వ‌స్తే.. ఆరు టీ20 మెగాటోర్నీల‌లో ఎన్నడూ ఓడిపోలేదు. ఇందులో ఐపీఎల్‌లో మూడు ఫైన‌ల్స్ ఉన్నాయి. ఆర్‌సీబీ త‌రుపున రెండు, సీఎస్‌కే (2021) త‌రుపున ఓ ఫైన‌ల్ మ్యాచ్ ఆడాడు.

*RCB Prize Money : 20 కోట్ల ప్రైజ్‌మ‌నీని ఆర్‌సీబీ ఆట‌గాళ్లు ఎలా పంచుకుంటారు? భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఏమ‌న్నాడంటే..?

గుజరాత్ టైటాన్స్ విషయానికొస్తే, జోస్ బట్లర్ , ప్రసిద్ధ్ కృష్ణ, కగిసో రబాడా, సాయి సుదర్శన్. వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన జ‌ట్టులో స‌భ్యులు కాలేక‌పోయారు. ఈ నలుగురితో పాటు యజ్వేంద్ర చాహల్ , మోహిత్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎస్ అరవింద్, లక్ష్మీపతి బాలాజీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ , షిమ్రాన్ హెట్మెయర్ , జహీర్ ఖాన్, 2026 టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, మార్కస్ స్టోయినిస్, సౌరభ్ తివారీ, జయదేవ్ ఉనద్కత్ వంటి ఆట‌గాళ్లు పలు ఐపీఎల్ ఫైనల్స్‌లో ఆడిన‌ప్ప‌టికి వాటన్నిటిలోనూ ఓడిపోయారు.

రెండు లేదా అంత‌కంటే ఎక్కువ ఫైన‌ల్స్ ఆడిన‌ప్ప‌టికి కూడా ఐపీఎల్ గెలిచిన జ‌ట్టులో భాగం కాలేని స‌భ్యులు..

* యుజ్వేంద్ర చాహల్ – మూడు ఫైనల్స్ ఆడ‌గా మూడింటిలో ఓడిపోయాడు
* మోహిత్ శర్మ – మూడు ఫైనల్స్ ఆడ‌గా మూడింటిలో ఓడిపోయాడు
* త్రిపాఠి – మూడు ఫైనల్స్ ఆడ‌గా మూడింటిలో ఓడిపోయాడు
* జోస్ బట్లర్ – రెండు ఫైన‌ల్స్ ఆడ‌గా రెండింటిలో ఓడిపోయాడు
* క‌గిసో రబాడ – రెండు ఫైన‌ల్స్ ఆడ‌గా రెండింటిలో ఓడిపోయాడు
* వాషింగ్టన్ సుందర్ – రెండు ఫైన‌ల్స్ ఆడ‌గా రెండింటిలో ఓడిపోయాడు
* ప్రసిద్ధ్ కృష్ణ – రెండు ఫైన‌ల్స్ ఆడ‌గా రెండింటిలో ఓడిపోయాడు
* సాయి సుదర్శన్ – రెండు ఫైన‌ల్స్ ఆడ‌గా రెండింటిలో ఓడిపోయాడు

*RCB Bench Players : ఛాంపియ‌న్ జ‌ట్టులో భాగ‌మై.. ఒక్క మ్యాచ్ ఆడ‌ని ఆర్‌సీబీ ఆట‌గాళ్లు.. వేలంలో కోట్ల వ‌ర్షం

* ఏబీ డివిలియర్స్ – రెండు ఫైన‌ల్స్ ఆడ‌గా రెండింటిలో ఓడిపోయాడు
* క్రిస్ గేల్ – రెండు ఫైన‌ల్స్ ఆడ‌గా రెండింటిలో ఓడిపోయాడు
* షిమ్రాన్ హెట్మయర్ – రెండు ఫైన‌ల్స్ ఆడ‌గా రెండింటిలో ఓడిపోయాడు
* జహీర్ ఖాన్ – రెండు ఫైన‌ల్స్ ఆడ‌గా రెండింటిలో ఓడిపోయాడు
* అక్షర్ పటేల్ – రెండు ఫైన‌ల్స్ ఆడ‌గా రెండింటిలో ఓడిపోయాడు
* మార్కస్ స్టోయినిస్ – రెండు ఫైన‌ల్స్ ఆడ‌గా రెండింటిలో ఓడిపోయాడు
*ఎస్ తివారీ – రెండు ఫైన‌ల్స్ ఆడ‌గా రెండింటిలో ఓడిపోయాడు
*జయదేవ్ ఉనద్కత్ – రెండు ఫైన‌ల్స్ ఆడ‌గా రెండింటిలో ఓడిపోయాడు
*ఎస్ అరవింద్ – రెండు ఫైన‌ల్స్ ఆడ‌గా రెండింటిలో ఓడిపోయాడు
* ల‌క్ష్మీప‌తి బాలాజీ – రెండు ఫైన‌ల్స్ ఆడ‌గా రెండింటిలో ఓడిపోయాడు