×
Ad

IND vs PAK : అటు అభిషేక్ శ‌ర్మ‌.. ఇటు తిల‌క్ వ‌ర్మ‌.. పాక్ పై కోహ్లీ రికార్డును తొలుత అందుకునేది ఎవ‌రో?

పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు (IND vs PAK) టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు అభిషేక్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మ‌ల‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

Tilak Varma and Abhishek Sharma eye on Most sixes for India vs Pakistan in T20Is

IND vs PAK : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా కొలంబో వేదిక‌గా నేడు (ఆదివారం ఫిబ్ర‌వ‌రి 15న‌) భార‌త్‌, పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు అభిషేక్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మ‌ల‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

పాకిస్థాన్ పై టీ20ల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన టీమ్ఇండియా ప్లేయ‌ర్‌గా నిలిచేందుకు వీరు కాస్త దూరంలో ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ రికార్డు టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు విరాట్ కోహ్లీ పేరిట ఉంది.

ఇదేం కోరికరా బాబూ.. భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌కు ముందు మాజీ క్రికెట‌ర్ వింత వ్యాఖ్య‌లు..

విరాట్ కోహ్లీ పాక్‌తో 11 టీ20 మ్యాచ్‌లు ఆడ‌గా 11 సిక్స‌ర్లు బాదాడు. ఆ త‌రువాతి స్థానంలో యువ‌రాజ్ సింగ్ ఉన్నాడు. యువీ 8 మ్యాచ్‌ల్లో 9 సిక్స‌ర్లు కొట్టాడు. ఇక అభిషేక్, తిల‌క్ వ‌ర్మ‌ల విష‌యానికి వ‌స్తే.. వీరిద్ద‌రు పాక్ పై చెరో 7 సిక్స‌ర్లు కొట్టారు. ఆదివారం కొలంబో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో ఎవ‌రు 5 సిక్స‌ర్లు కొడితే.. అత‌డు కోహ్లీ రికార్డును బ్రేక్ చేస్తాడు.

టీ20ల్లో పాక్ పై అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన భార‌త ప్లేయ‌ర్లు వీరే..

* విరాట్ కోహ్లీ – 11 మ్యాచ్‌ల్లో 11 సిక్స‌ర్లు
* యువ‌రాజ్ సింగ్ – 8 మ్యాచ్‌ల్లో 9 సిక్స‌ర్లు
* అభిషేక్ శ‌ర్మ – 3 మ్యాచ్‌ల్లో 7 సిక్స‌ర్లు
* తిల‌క్ వ‌ర్మ – 3 మ్యాచ్‌ల్లో 7 సిక్స‌ర్లు
* రోహిత్ శ‌ర్మ – 12 మ్యాచ్‌ల్లో 7 సిక్స‌ర్లు

IND W vs AUS W : భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య నేడే తొలి టీ20.. మ్యాచ్ టైమింగ్‌, ఎక్క‌డ చూడొచ్చంటే?

అనారోగ్యం కార‌ణంగా న‌మీబియాతో మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ ఆడ‌లేదు. అయితే.. పాక్‌తో మ్యాచ్‌లో అత‌డు పాల్గొంటాడ‌ని కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ తెలిపాడు. ప్ర‌స్తుతం ఉన్న ఫామ్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే ఈ రికార్డును అభిషేక్ సాధించే అవ‌కాశం ఉంది.