Tilak Varma : వెస్టిండీస్‌తో ఐదో టీ20 మ్యాచ్.. తిలక్ వర్మను ఊరిస్తున్న భారీ మైలురాయి..
వెస్టిండీస్‌తో ఐదో టీ20 మ్యాచ్‌కు ముందు తిలక్‌వర్మను (Tilak Varma ) అరుదైన మైలురాయి ఊరిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published on- October 16, 2026 / 07:40 AM IST
Tilak Varma need 7 more to complete 100 sixes in international
Tilak Varma : శనివారం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు తెలుగు తేజం, మిడిల్ ఆర్డర్ ఆటగాడు తిలక్ వర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో అతడు 7 సిక్సర్లు బాదితే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘనత సాధించిన ఏడో భారత బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కుతాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్‌లు మాత్రమే భారత్ తరుపున టీ20ల్లో 100 సిక్సర్లు మైలురాయిని చేరుకున్నారు.
SRH : కావ్యా పాప మాస్టర్ ప్లాన్.. నట్టూని మళ్లీ తీసుకొచ్చింది..
ఇక తిలక్ వర్మ విషయానికి వస్తే.. 2023లో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు 69 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 44.7 సగటుతో 1834 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 10 అర్థశతకాలు ఉన్నాయి. 140 ఫోర్లు, 93 సిక్సర్లు బాదాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 సిక్సర్లు కొట్టిన భారత ప్లేయర్లు..
* రోహిత్ శర్మ – 159 మ్యాచ్‌ల్లో 205 సిక్సర్లు
* సూర్యకుమార్ యాదవ్ – 113 మ్యాచ్‌ల్లో 179 సిక్సర్లు
* అభిషేక్ శర్మ – 66 మ్యాచ్‌ల్లో 142 సిక్సర్లు
* హార్దిక్ పాండ్యా – 138 మ్యాచ్‌ల్లో 126 సిక్సర్లు
* విరాట్ కోహ్లీ – 125 మ్యాచ్‌ల్లో 124 సిక్సర్లు
* సంజూ శాంసన్ – 76 మ్యాచ్‌ల్లో 102 సిక్సర్లు
ఇక బెంగళూరు మ్యాచ్ విషయానికి వస్తే.. ఇరు జట్లకు ఈ మ్యాచ్‌కు కీలకం కానుంది. అటు భారత్, ఇటు వెస్టిండీస్ జట్లు సిరీస్‌లో చెరో 2 మ్యాచ్‌లు గెలిచాయి. దీంతో బెంగళూరు మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారికే సిరీస్ సొంతం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది.
