Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో ఖాతా తెరిచిన భారత్.. మీరాబాయి చానుకు రజత పతకం

Tokyo Olympics 2020: ఈ రోజు ఒలింపిక్ క్రీడల్లో రెండవ రోజు భారత్‌కు తొలి మెడల్ దక్కింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో మీరాబాయి చాను అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుకు 49 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది. స్నాచ్‌లో 87 కేజీలు ఎత్తిన మీరాబాయి, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115 కేజీలు వెయిట్‌ ఎత్తింది.

వెయిట్ లిఫ్టింగ్‌లో ఒలింపిక్ క్రీడల చరిత్రలో రెండవ పతకాన్ని మీరాబాయి చాను భారత్‌కు ఇచ్చారు. వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన తొలి మహిళా క్రీడాకారిణి మాత్రం మీరాబాయే. ఈ ఏడాది ఫస్ట్ ఒలింపిక్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించారు చాను. మీరాబాయి చాను భారత్‌కు రజత పతకం సాధించగా.. ఒలింపిక్ క్రీడల రెండవ రోజునే, భారతదేశం పతకాల జాబితాలో తన ఖాతాను తెరవగలిగింది.

టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన సుమిత్ నాగల్ తొలి మ్యాచ్ గెలిచాడు. ఉజ్బెకిస్తాన్ ఆటగాడిని ఓడించి పతక రేసులో సుమిత్ నాగల్ ఒక అడుగు ముందుకు వేశారు. విలువిద్య మిశ్రమ డబుల్స్ ఈవెంట్‌లో మాత్రం భారత్‌కు నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో దీపిక, ప్రవీణ్ జంట ఓడిపోయింది. కొరియా జత దీపిక-ప్రవీణ్‌లను ఓడించి సెమీస్‌లోకి ప్రవేశించింది.

ట్రెండింగ్ వార్తలు