Tokyo Paralympics: పారాలింపిక్స్‌లో షూటర్ అవనీ లేఖారాకు గోల్డ్ మెడల్..

టోక్యో పారాలింపిక్స్‌లో ఇండియాకు మరో పతకం చేరింది. షూటింగ్ లో అవని లేఖారా బంగారు పతకాన్ని సాధించింది.

Tokyo Paralympics: టోక్యో పారాలింపిక్స్‌లో ఇండియాకు మరో పతకం చేరింది. మహిళల 10 మీటర్ల AR స్టాండింగ్ SH1 లో అవని లేఖరా స్వర్ణం గెలుచుకుంది. దాంతో పారాలింపిక్స్ లో గోల్డ్ సాధించిన భారత మొదటి మహిళా ప్లేయర్ గా అవనీ చరిత్ర సృష్టించింది. అంతకుముందు.. ఏస్ షూటర్  క్వాలిఫికేషన్ రౌండ్‌లో మొత్తం స్కోరు 621.7 తో అవనీ ఏడవ స్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్‌ మ్యాచ్‌లో 104.9, 104.8, 104.1 స్కోర్‌తో ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.  ఫైనల్లో మొత్తం 249.6 స్కోర్‌తో అవనీ బంగారు పతకాన్ని సాధించి ప్రపంచ రికార్డును సమం చేసింది. టోక్యో పారాలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్‌కు ఇది నాలుగో పతకం.

గోల్డ్ మెడల్ సాధించిన అవనీని ప్రధాని మోదీ ట్విట్టర్‌ వేదికగా అభినందించారు. ‘అసాధారణ ప్రదర్శన.. కష్టపడి.. అర్హత సాధించి బంగారాన్ని గెలుచుకున్నందుకు మీకు అభినందనలు, మీకు షూటింగ్ పట్ల ఉన్న మక్కువతోనే ఇది సాధ్యమైంది. భారతీయ క్రీడలకు ఇది నిజంగా ప్రత్యేకమైన క్షణం. మీ భవిష్యత్తులో మరిన్ని పతకాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.


అవనీ లేఖారా జైపూర్ నివాసి.. 2017 లో యూఏఈలో జరిగిన వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఆమె తండ్రి ప్రోత్సాహంతో 2015 లో షూటింగ్ ప్రారంభించింది. ఆమె షూటింగ్, విలువిద్యను ప్రారంభించింది. షూటింగ్‌పై ఎక్కువ ఆసక్తి ఉండటంతో ఆమె తండ్రి షూటింగ్ లో ప్రోత్సహించారు. భారతీయ ఒలింపియన్ అభినవ్ బింద్రా పుస్తకం నుంచి ప్రేరణ పొందిన అవనీ ఈ విజయాన్ని అందుకుంది.
India : ఆసియా జూ.బాక్సింగ్, పంచ్‌‌లతో అదరగొట్టారు..నాలుగు స్వర్ణాలు

భారతీయ పారా అథ్లెట్లు భావినా పటేల్ (వెండి), నిషాద్ కుమార్ (రజతం), వినోద్ కుమార్ (కాంస్య) కూడా వరుసగా పారా టేబుల్ టెన్నిస్, హైజంప్, డిస్కస్ త్రోలో పతకాలు సాధించి భారత్ గర్వపడేలా చేశారు. ఆదివారం టీటీ ప్లేయర్‌ భవీనాబెన్ సిల్వర్‌ మెడల్‌ సాధించిన విషయం తెలిసిందే. టేబుల్‌ టెన్నిస్‌లో పతకం సాధించిన మొదటి ప్లేయర్‌గా భవీనా నిలిచారు. 2016లో జరిగిన రియో పారాలింపిక్స్‌లో ఉమెన్స్‌ షాట్‌పుట్‌లో దీపా మాలిక్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించింది.

దీపా రియో ​​2016 లో మహిళల షాట్ పుట్‌లో రజతం సాధించింది. పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన మొదటి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి PCI చీఫ్ దీపా మాలిక్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ మహిళా అథ్లెట్‌గా నిలిచింది. పారాలింపిక్స్ లో భారత్ కు ఇప్పటివరకూ 4 పతకాలు వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు