IPL 2024 promo : 90 సెకన్లు ఉన్న ఐపీఎల్ ప్రొమో చూశారా? యానిమల్ మూవీ స్టైల్లో రిషబ్ పంత్ ఎంట్రీ
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ సీజన్ మరో 20 రోజుల్లో ఆరంభం కానుంది.
- Thota Vamshi Kumar
- Updated on- March 3, 2024 / 07:16 PM IST
Top Indian stars feature in IPL 2024 promo video
IPL 2024 : క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ సీజన్ మరో 20 రోజుల్లో ఆరంభం కానుంది. ఇప్పటికే ఐపీఎల్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) విడుదల చేసింది. ఈ మెగాటోర్నీ టీవీల్లో స్టార్‌స్పోర్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ క్రమంలో ఐపీఎల్‌కు సంబంధించిన ప్రొమోను స్టార్‌స్పోర్ట్స్ విడుదల చేసింది. ఈ వీడియోలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌లతో పాటు శ్రేయస్ అయ్యర్ సైతం కనిపించాడు.
ఈ వీడియోలో రిషబ్ పంత్ సిక్కు వేషదారణలో కనిపించాడు. యానిమల్ సినిమా స్ట్రైల్లో ఎంట్రీ ఇచ్చిన పంత్.. ఓ పంజాబీ డాబాలోకి వెళ్తాడు. గత సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో జడేజా గుజరాత్ పై సిక్స్ కొట్టి చెన్నైని గెలిపించిన తరువాత.. ధోని వచ్చి జడేజాను కౌగిలించుకునే వీడియోను చూసిన పంత్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అటు శ్రేయస్ అయ్యర్.. రింకూ సింగ్ ఆఖరి ఓవర్లో ఐదు బంతులకు ఐదు సిక్సర్లు కొట్టిన వీడియోని ఫ్యామితో చూస్తూ ఎంజాయ్ చేస్తాడు.
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ సెంచరీ మిస్ ? మరో 97 పరుగులు చేసుంటేనా?
ఇంకోవైపు కేఎల్ రాహుల్ ఓ విద్యార్థిగా కనిపించాడు. లక్నో, ఆర్సీబీ మ్యాచ్‌లో అంపైర్ తప్పిదం కారణంగా మ్యాచ్ ఓడిపోవడాన్ని చూసి సహించలేక ప్రస్టేషన్లో తన చేతిలో ఉన్న బుక్‌ను నేలపై విసిరేస్తాడు. అపై అరుస్తూ కనిపించాడు. ఇక అందరి కంటే చివరగా హార్దిక్ పాండ్య కనిపించాడు. ఓ కంపెనీ సీఈవోగా కనిపించిన అతడు జపాన్ డెలిగేట్స్‌తో సమావేశం అవుతాడు. ముంబై ఇండియన్స్ ఐదోసారి కప్పును ముద్దాడింది అని టీవీల్లో చెప్పగానే ఆనందంతో సంబరాలు చేసుకుంటూ కనిపించాడు. మొత్తంగా 90 సెకన్లు నిడివి కలిగిన ఈ వీడియో మొత్తంగా ఆకట్టుకుంది.
