Shreyas Iyer : శ్రేయ‌స్ అయ్య‌ర్ సెంచ‌రీ మిస్ ? మ‌రో 97 ప‌రుగులు చేసుంటేనా?

త‌న చెత్త ఫామ్‌ను రంజీల్లో కూడా కంటిన్యూ చేస్తున్నాడు అయ్య‌ర్‌.

Shreyas Iyer : శ్రేయ‌స్ అయ్య‌ర్ సెంచ‌రీ మిస్ ? మ‌రో 97 ప‌రుగులు చేసుంటేనా?

Shreyas Iyer

Iyer : పేల‌వ ఫామ్‌తో టీమ్ఇండియాలో చోటు కోల్పోయిన శ్రేయ‌స్ అయ్య‌ర్ రంజీట్రోఫీలో స‌త్తా చాటి మ‌ళ్లీ భార‌త జ‌ట్టులోకి వ‌స్తాడ‌ని అంతా భావించారు. అయితే.. త‌న చెత్త ఫామ్‌ను రంజీల్లో కూడా కంటిన్యూ చేస్తున్నాడు అయ్య‌ర్‌. రంజీట్రోఫీ 2023-24 సీజ‌న్‌లో భాగంగా ముంబై, త‌మిళ‌నాడు జ‌ట్లు సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతున్నాయి. ముంబై జ‌ట్టుకు అయ్య‌ర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు.

బ్యాటింగ్‌లో అత‌డు కేవ‌లం మూడు ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. వారియ‌ర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో నెటింట శ్రేయ‌స్ పై విమ‌ర్శ‌ల జ‌డివాన కొన‌సాగుతోంది. అయ్యో ఎంత ప‌ని జ‌రిగింది. మ‌రో 97 ప‌రుగులు చేసుంటే సెంచ‌రీ పూర్తి అయ్యేదిగా అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

Rohit Sharma : ఎలైట్ కెప్టెన్ల జాబితాలో రోహిత్ స్థానం సంపాదిస్తాడా?

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన త‌మిళ‌నాడు 146 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ముంబై బౌల‌ర్ల‌లో తుషార్ పాండే మూడు వికెట్లు, శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీశాడు. అనంత‌రం మొద‌టి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ముంబైకి త‌మిళ‌నాడు బౌల‌ర్లు చుక్కలు చూపించారు. ఓపెన‌ర్ ఫృథ్వీ షా (5), ల‌ల్వానీ (15), మోహిత్ అవస్తి (2), ర‌హానే (19), అయ్య‌ర్ (3) లు విఫ‌లం అయ్యారు.

ఆల్‌రౌండ‌ర్ శార్దూల్ ఠాకూర్ (109) సెంచ‌రీ, అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్ హీరో ముషీర్ ఖాన్ (55), తనుష్ కోటియన్(74 నాటౌట్‌) అర్ధ‌శ‌త‌కంతో రాణించ‌డంతో రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ముంబై తొమ్మిది వికెట్లు కోల్పోయి 353 ప‌రుగులు చేసింది. కోటియన్‌తో పాటు తుషార్ దేశ్ పాండే (19) క్రీజులో ఉన్నాడు. ప్ర‌స్తుతం ముంబై 207 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. త‌మిళ‌నాడు బౌల‌ర్ల‌లో స్పిన్నర్‌ సాయికిషోర్ 6 వికెట్ల‌తో చెల‌రేగాడు.

IPL 2024 : ఐపీఎల్ 2024కు ముందు గుజ‌రాత్ టైటాన్స్‌కు భారీ షాక్‌.. ‘జార్ఖండ్ క్రిస్ గేల్‌’కు యాక్సిడెంట్..